సీతారాముల కళ్యాణం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరి గారు
Audio
పల్లవి :
సీతారాముల కళ్యాణం చూతము రారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి
చరణం :
చూచు వారలకు చూడముచ్చటట చూడముచ్చటట
పుణ్య పురుషులకు ధన్యభాగ్యమట ధన్యభాగ్యమట
భక్తియుక్యులకు ముక్తి ప్రదమట ఆ.. ఆ ..ఆ ...ఆ..ఆ….
సురలను మునులను చూడ వత్తురట
…..కళ్యాణము చూతము రారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి…..
దుర్జన కోటి దర్పమణంచంగా దర్పమణంచంగా
సజ్జన కోటిని సంరంక్షింపగా సంరక్షింపగా
ధారుణి శాంతిని స్ధాపన సేయగా ఆ.. ఆ ...ఆ ….ఆ….ఆ
నరుడై పుట్టిన పురుషోత్తముని
…..కళ్యాణము చూతము రారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి…..
దశరధరాజు సుతుడై వెలసి
కౌశికు యాగం రక్షణ చేసి
జనకుని సభలో హరివిల్లు విరిచి ఆ ఆ ఆ ఆ ఆ
జానకి మనసు గెలిచిన రాముని
…..కళ్యాణము చూతము రాతండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి…..
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి
మణిభాసికమును నుదుడను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ ఆ ఆ
పెళ్ళి కూతురై వెలసిన సీతా
…..కళ్యాణము చూతము రాతండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి…..
సంపెంగ నూనెతో కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము దీర్చి
చెంపకు వాసిగా చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ
పెండ్లి కొడుకై వెలసిన రాముని
…..కళ్యాణము చూతము రాతండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి…..
జానకి దోసిట కెంపులు ప్రోవై
రాముని దోసిట నీలపు రాసై
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఆ ఆ ఆ ఆ ఆ
శిరమున వెలసిన సీతారాముల
…..కళ్యాణము చూతము రాతండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి…..
ఆనందమానంద మాయనే మా సీతమ్మ పెళ్ళికూతురాయెనే
ఆనందమానందమాయనే మారామయ్య పెండ్లి కొడుకాయెనే
మా సీతమ్మ పెళ్ళి కూతురాయెనే
.మారామయ్య పెండ్లికొడుకాయెనే
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి