7, మార్చి 2019, గురువారం

Peetameeda gajjelu పీట మీద గజ్జెలు

పీట మీద గజ్జెలు
గానం : భవిరిశెట్టి సుజాత
Audio
పీట మీద గజ్జెలు పిడికిట అంబులు
రాత్రిళ్ళు నేకంటి రామ కలలు
కోట సత్తున రెండు కోయిళ్ళు కూయంగ
నవ్వుతూ సీతమ్మ నగరీ కెళ్ళగను
మంగళం మంగళం

అందంగా కౌసల్య అయోధ్య
నుండంగా
మంగళ సూత్రము సేయుమని అడగ
చేసింది కౌసల్య సేతాళ ఫణి పెట్టి
శృంగార మంపరే సీతమ్మ మెడను
మంగళం మంగళం

జీలకర్ర బెల్లము అవి మూడు దోసెళ్ళు
సీతమ్మ శిరస్సున అంటేటప్పుడు
భరత శతృఘ్నలు వారన్నదమ‍్ములు
భక్తితో సెయి పెట్టి కంకణ కట్టు
మంగళం  మంగళం

రామయ్యకు మంగళం మంగళం
సీతమ్మకు మంగళం మంగళం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి