7, మార్చి 2019, గురువారం

Pendli kodukata పెండ్లి కొడుకట

పెండ్లి కొడుకట
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరి గారు.
Audio
పెండ్లి కొడుకట బహుపెంకి వాడట
మన పెండ్లి కూతుర్ని వీనికెందుకు పెండ్లిజేస్తిమి…2

కోమలాంగిరో బహుకోపదారట
మన కోమలాంగికి కోపదారికి కోరి జూస్తిమి...2
…...పెండ్లి కొడుకట….

చదువురాదట సరిగా సంధ్య లేదట
చదువు లేని వానికి మనము సఖియనిస్తిమి….2
…….పెండ్లి కొడుకట….

మందయానరో ఈ మందగానికి
పొందు మీరగ మందగమనను ఎరక్క జేస్తిమి… 2

పెండ్లి కొడుకట బహుపెంకి వాడట
మన పెండ్లి కూతుర్ని వీనికెందుకు పెండ్లిజేస్తిమి
మన పెండ్లి కూతుర్ని వీనికెందుకు పెండ్లిజేస్తిమి
మన పెండ్లి కూతుర్ని వీనికెందుకు పెండ్లిజేస్తిమి…….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి