16, ఆగస్టు 2019, శుక్రవారం

Kaveri Ranga Ranga కావేరి రంగ రంగా

కావేరి రంగ రంగా
రాగం : ఆనందభైరవి , తాళం : ఖండచాపు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు 
(చిన్ని క్రిష్ణుని పాటలు)
Audio
పల్లవి :
కావేరి రంగ రంగ
నాయన్న కస్తూరి రంగ రంగ
దేవేరి యైన నీతో
నామనవి తెలిపి రక్షింప లేదా

చరణం :
సగము పోయిన ప్రాణము
నాస్వామి తగని దారుణ భారము
అడుగిడగనే నేరము
నాతండ్రి అభయ మిడి కాపాడుము
….కావేరి రంగ రంగ….

వైకుంఠ నగరి విడిచి
లోకాల నెల్ల కడచి
నాకంటి నీరు తుడిచి
చల్లగా సాకగా ఇటు వస్తివే
….కావేరి రంగ రంగ….

ఏలాటి కరుణ నీది
నాయన్న నీలాటి దైవమేది
నాబోటి దీన యేది
నాతండ్రి యీపాటికైన రావే….3

1 కామెంట్‌: