మంగళహారతి నీకమ్మా
కేదారగౌళ రాగం, ఆదితాళం
సంగీతం : ద్వారం త్యాగరాజు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
మంగళహారతి నీకమ్మా
అమ్మా హారతి గైకొనుమా
అమృతవర్షిణి లలితమ్మ
అమ్మా హారతి చేకొనుమా
అను పల్లవి :
వేదనివాసిని గాయత్రి
మంగళహారతి నీకమ్మా
విశ్వనాధుని అన్నపూర్ణ
నిత్యమంగళం నీకమ్మా
…….మంగళహారతి నీకమ్మా
అమ్మా హారతి గైకొనుమా….
చరణం :
ఆనందదాయిని మహలక్ష్మీ
ఆనందహారతి నీకమ్మా
రాయంచ వాహన నీవమ్మా
రాగాలహారతి గైకొనుమా
బాలారూపిణి నీవమ్మా
భక్తులహారతి చేకొనుమా
మహిషాసుర మర్ధినివే
మగువల హారతి నీకమ్మా
…...మంగళహారతి నీకమ్మా
అమ్మా హారతి గైకొనుమా…..
రాజిత గుణముల రాజేశ్వరివే
రవ్వల హారతి నీకమ్మా
సింహ వాహనవు దుర్గమ్మ
సిరులహారతి గైకొనుమా
నవ యవ్వనవు నీవమ్మ
నవరత్న హారతి గైకొనుమా
దవళ వర్ణవే శివాని
దీపాల హారతి నీకమ్మ…...
…..మంగళహారతి నీకమ్మా
అమ్మా హారతి గైకొనుమా
అమృత వర్షిణి లలితమ్మా
అమ్మా హారతి చేకొనుమా….3
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి