18, నవంబర్ 2019, సోమవారం

Bholanath umapathey భోళానాధ ఉమాపతే

భోళానాధ ఉమాపతే
హమీర్ కళ్యాణి రాగం , మిశ్రచాపు తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
భోళానాధ ఉమాపతే
శంభో శంకర పశుపతే

చరణం :
నందివాహన నాగభూషణ
చంద్రశేఖర జటాధరా
గంగాధర గౌరీ మనోహర
గిరిజా కాంత సదాశివ
…..భోళానాధ ఉమాపతే…..

కైలాసవాసా కనక సభేశా
గౌరీ మనోహర విశ్వేశా
శ్మశానవాస చిదంబరేశా
నీలకంఠా మహాదేవ
…..భోళానాధ ఉమాపతే…..

శూలధర జ్యోతి ప్రకాశ
విభూది సుందర పరమేశా
ఢంఢం ఢం ఢం ఢమరుక నాద
పార్వతి రమణ శివా భవా
భంభం భం భం శంఖ నాద
పార్వతి రమణ శివా భవా
…..భోళానాధ ఉమాపతే
శంభో శంకర పశుపతే
భోళానాధ ఉమాపతే….3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి