హే విశ్వనాధా కాశీపతే
శివపదం
రచన : సామవేదం షణ్ముఖ శర్మగారు
సంగీతం : మల్లాది సూరిబాబుగారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరి గారు
ఆదితాళం, రాగం : ఝంఝూటి
Audio
పల్లవి :
హే విశ్వనాధా కాశీపతే
శ్రీ విశాలాక్షీపతే నమోస్తుతే
చరణం :
గంగాతీర నిత్య విహార
శృంగారిత హిమ కిరణ కిశోర
అంగజ భంగ యమాంతక ధీర
భృంగి నంది పరివేష్టిత భవహర
హే విశ్వనాధా…..
మణికర్ణికాది తీర్ధ నివేషిత
ఘృణిలోలార్కాది దివిజ వందిత
ఘృణాకర బిందు మాధవార్చిత
గణనాయక ఢుండి దేవ మోదిత
హే విశ్వనాధా….
ధనురాకారానందవనే ఘనే
వినతామరనుత మోక్ష నగరే
అనుపమా విముక్తే ఉమయా సహ
అనిశం ఖేలసి షణ్ముఖ జనక
…...హే విశ్వనాధా కాశీపతే
శ్రీ విశాలాక్షీపతే నమోస్తుతే…..
హే విశ్వనాధా...3
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి