21, జూన్ 2020, ఆదివారం

Eamani pogadudame ఏమని పొగడుదుమే

ఏమని పొగడుదుమే 

రాగం:ఆభేరి , తాళం :ఆదితాళం 

గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

(అన్నమయ్య సంకీర్తనలు)


Audio

పల్లవి :

ఏమని పొగడుదుమే 

ఏమని పొగడుదుమే యిక నిను

ఆమని సొబగుల అలమేల్మంగ 

ఏమని పొగడుదుమే ..2


చరణం :

తెలికన్నుల నీ తేటలే కదవే 

వెలయగ విభునికి వెన్నెలలు

పొలకల మొలకల పొదులివి గదవే

పలుమరు పువ్వుల పానుపులు 

ఏమని పొగడుదుమే ..2


తియ్యని నీమోవి తేనెలే కదవే

వియ్యపు రమణుని విందులివి 

ముయ్యక మూసిన మొలక నవ్వు గదె 

నెయ్యపు గప్పురపు నెరి భాగాలు 

ఏమని పొగడుదుమే ..2


కైవసమగు నీ కౌగిలే కదవే 

శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు 

తావు కొన్న మీ తమకములే గదే

కావించిన మీ కళ్యాణములు 

…...ఏమని పొగడుదుమే యిక నిను

ఆమని సొబగుల అలమేల్మంగ 

ఏమని పొగడుదుమే ..2



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి