21, జూన్ 2020, ఆదివారం

Nekondaku neve నీకొండకు నీవే


నీకొండకు నీవే

చక్రవాకం రాగం , ఆది/ఏక తాళం

గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

రచన :చింతగుంట సుబ్బారావుగారు


Audio

సాకి :

నీకొండకు నీవే…...రప్పించుకో…...

ఆపద మ్రొక్కులు మా…..చే యిప్పించుకో


పల్లవి :

నీకొండకు నీవే రప్పించుకో

ఆపద మ్రొక్కులు మాచే యిప్పించుకో

ఓ తిరుపతి వేంకటేశా ….

ఓ తిరుపతి వేంకటేశా ఓ శ్రీనివాశా

నీ విచ్చిన యీ జన్మకు విలువ కట్టుకో 

…….నీ కొండకు నీవే రప్పించుకో...


చరణమన :

కొండంత సంసారం మోయలేని మానవులం

ఏడూ కొండల నెక్కి రమ్మంటే రాలేము

సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బరులం

స్వర్గానికి నిచ్చెనలు వేయలేము …..

……….నీకొండకు నీవే రప్పించుకో

ఆపద మ్రొక్కులు మాచే యిప్పించుకో

నీ కొండకు నీవే రప్పించుకో…..


మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై

మా లోపలి దివ్యజ్యోతి మసకేసి పోతున్నది

అహంకార మణిగించి మమకారం తొలగించి

చేయూత నిచ్చి మమ్ము చేరదీసుకో 

…….నీకొండకు నీవే రప్పించుకో

ఆపద మ్రొక్కులు మాచే యిప్పించుకో

ఓ తిరుపతి వేంకటేశా ఓ శ్రీనివాశా

నీ విచ్చిన యీ జన్మకు విలువ కట్టుకో 

…….నీ కొండకు నీవే రప్పించుకో…3




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి