రారా హారతి గొనుము
రాగం : అరభి , తాళం : ఏక/ఆది
రచన : ముదిగొండ చందుశర్మ
స్వర రచన : వి.వి.యస్.భార్గవ
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
(మంగళహారతులు)
Audioపల్లవి :
రారా హారతిగొనుము ఓ శంకరా
మము పాలింపరారా ఓ పరమేశ్వరా
చరణం :
నీకొరకే నాగౌరి వేచున్నది
మంగాళమందింప మనసైనది
కరుణేశ్వరా ఓ గిరిజాపతే
నిన్నేల మరువనురా మహదీశ్వరా
మము జేర రావేర లోకేశ్వరా
…..రారా హారతిగొనుము ఓ శంకరా
మము పాలింపరారా ఓ పరమేశ్వరా…
నిను చూడ నాకనులు కడలైనది
నాభావంబు పలికింప యుగమైనది
కరుణింపరా ఓ భవసాగరా
కాళీశ ముక్తీశ గంగాధరా
ప్రణవేశ పరమేశ మముకావరా
…...రారా హారతిగొనుము ఓ శంకరా
మము పాలింపరారా ఓ పరమేశ్వరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి