10, జులై 2020, శుక్రవారం

Edutanunnadu vede ఎదుటనున్నాడు వీడె

ఎదుటనున్నాడు వీడె

రాగం : భుజంగిని ,తాళం : ఆది

స్వర రచన : నేదునూరి క్రిష్ణమూర్తిగారు

గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

(అన్నమయ్య సంకీర్తనలు)


Audio

పల్లవి :

ఎదుటనున్నాడు వీడె….

ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు

మదిదెలియా మమ్మా ఏమరునో గాని


చరణం :

పరమ పురుషుడట పసుల గాచెనట

సరవులెంచిన వినా సంగతా యిది

హరియేతానట ముద్దులందరికి జేసెనట

యిరవాయ నమ్మ సుద్దులేట్టివోగాని

…..ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు

….


వేదాల కోడయడట వెన్నలు దొంగిలెనట

నాదించి విన్నవారికి నమ్మికాయిది

ఆదిమూల మితడట ఆడికెల చాతలట

కాదమ్మ యీ సుద్దులు ఎట్టి కథలో గాని

…..ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు

…..


అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట

కొలదొకరికి చెప్పా కూడునా యిది

తెలిపి శ్రీ వేంకటాద్రి దేవుడై నిలిచెనట

కలదమ్మ తనకెంతో కరుణో గాని

…..ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు

మదిదెలియా మమ్మా ఏమరునోగాని

ఎదుటనున్నాడు వీడె…...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి