27, జులై 2020, సోమవారం

Meluk raghurama మేలుకో రఘురామ


మేలుకో రఘురామ

ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమం సమర్పించిన

వాసుదాసు  కీర్తన

భూపాలరాగం,ఆది తాళం

గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు


Audio


మేలుకో రఘురామ మేలుకో గుణధామ మేలుకో శుభనామ మేలుకో

మేలుకో కౌసల్య మేలిమిగన్నట్టి 

బాలమోహన రామ మేలుకో


అరుణోదయంబాయే అర్కుడు పొడతెంచు

ధరణికుల దీపిక మేలుకో

తరుణులు గీతములు తడయక పాడెదరు కరుణాసాగర రామ మేలుకో


సీతమ్మ యిదె లేచి చేతనద్దము బూని

చేరియున్నాదయ్యా మేలుకో

బ్రాతిగా పాదుకలు భరతుడు తెచ్చెను సీతాహృదయేశ మేలుకో


ధర్మరక్షణకాంచ ధరణి జనియించిన ధశరథనందన మేలుకో

ధర్మము నశియించే దానినుద్దరింప

దడయక యికనైన మేలుకో


నీదు సేవకులెల్ల నీదు దర్శనకాంక్ష నిలబడియున్నారు మేలుకో

కోదండరాఘవ గురుతుగ వారల ఆదరింపవలయు మేలుకో


ఏకశిలాపురిని నెలమి వసియించు లోకరక్షణశీల మేలుకో

నీకరుణాపాత్రుడు నీవాసుదాసుడు నీకృతి కీర్తించు మేలుకో

…...మేలుకో రఘురామ……………

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి