13, ఆగస్టు 2020, గురువారం

Kodandarama కోదండరామా

 కోదండరామ  

బిళహరి రాగం, ఆదితాళం

గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

రామదాసు కీర్తన


Audio

పల్లవి :

కోదండరామ  కోదండరామ 

కోదండరామా పాహి  పాహి


చరణం :

నీదండ నాకు నీవెందు బోకు

వాదెలా నీకు వలదు పరాకు

శ్రీరామ మమ్ము చేపట్టుకొమ్ము

ఆదుకోరమ్ము ఆరోగ్యమిమ్ము

….కోదండరామ….


జయరఘువీర జగదేకశూర

భయని నివార భక్తమందార

మణిమయభూషా మంజులభాషా

రణవిజయఘోషా రమణీయవేషా

….కోదండరామ….


తల్లియు నీవే తండ్రియు నీవే

దాతయు నీవే దైవము నీవే

సరసిజనేత్రా సౌందర్యగాత్రా

పరమపవిత్రా భవ్యచరిత్రా

…...కోదండరామ…..


వందనమయ్యా వాదేలనయ్యా

దండనచేయా తగదునీకయ్యా

లాలితహాసా లక్ష్మీవిలాసా 

పాలిత రామదాస భద్రాద్రి వాసా

….కోదండరామ  కోదండరామ 

కోదండరామా పాహి  పాహి

కోదండరామా పాహి...3….


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి