26, మార్చి 2023, ఆదివారం

పవళించవయ్య

పవళించవయ్య

రచన - తూము నరసింహ దాసు

గానం - మొక్కరాల కామేశ్వరి గారు

రాగం - శ్రీరాగం , తాళం - మిశ్రచాపు

Audio

॥ప॥ పవళించవయ్యా…..

 పవళించవయ్యా మా రామయ్య! 

పవళించవయ్యా! మా రామయ్య!


॥అ.ప॥ 

పవళింపు మీశేష పర్యంకమందున..2

కవగూడి సేవక గణములు గొల్వగా..2 

పవళించవయ్యా….మా రామయ్య

పవళించవయ్యా….


॥చ॥  

సొంపైన యువిదల గుంపుల వీణా వాయింపు  లాలింపుచు ఇంపొందు సతిగూడి

పవళించవయ్యా…..

సొంపైన యువిధల గుంపుల వీణా వాయింపు  లాలింపుచు యింపొందు సతిగూడి

….పవళించవయ్యా..మారామయ్య

పవళించవయ్యా….

 

॥చ॥ 

చిలుకల కొలుకులు పలుకు తీయని ముద్దు

పలుకు లాలింపుచు కలికి సీతను గూడి

పవలించవయ్యా...

చిలుకల కొలుకులు పలుకు తీయని ముద్దు

పలుకు లాలింపుచు కలికి సీతను గూడి

పవళించవయ్యా.. మా రామయ్య

 పవళించవయ్యా…

 

॥చ॥ 

తిరముగ సాకేత పురమున నెలకొని 

నరసింహదాసుని యెరసి బ్రోచెడు సామి

పవళించవయ్యా...

తిరముగ సాకేత పురమున నెలకొని నరసింహదాసుని యెరసి బ్రోచెడు సామి

పవళించవయ్యా..మా రామయ్య

పవళింపు మీశేష పర్యంకమందున

కవగూడి సేవక గణములు గొల్వగా

పవళించవయ్యా… మా రామయ్య…2

పవళించవయ్యా….

లా…లి…లాలి

లా…లీ..లా…లీ…

లా…లి….లా…….లీ


ఆరగించవయ్య రామ

 ఆరగించవయ్య రామ 

రచన : తూము నరసింహదాసు

రాగం:ఝుంఝుటి , తాళం: తిశ్రగతి….ఆది

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు


Audio

పల్లవి:

ఆరగించవయ్య రామ అతివ తోడను…….

ఆరగించవయ్య రామ అతివ తోడను  సీతమ్మతోడ ..2

….ఆరగించవయ్య రామ అతివ తోడను సీతమ్మతోడ

ఆరగించవయ్య రామ అతివ తోడను….2


చరణం:

ఆరగించవయ్య అరటి పండ్లు చెఱుకు పానకము ..2

దోర మామిడి పండ్లు పనసతొనలు మంచి తేనె చక్కెర..2

….ఆరగించవయ్య రామ అతివ తోడను సీతమ్మతోడ

ఆరగించవయ్య రామ అతివ తోడను….


ఊరగాయ పెరుగు చలిది తీరు, పులియోగిరమును …2

పాలు మీగడ కండచక్కెర బంగారు గిన్నెలతో ..2

….ఆరగించవయ్య రామ అతివ తోడను సీతమ్మతోడ

ఆరగించవయ్య రామ అతివ తోడను ….


దాసమాన సాంబుజ విభాసమాన రామచంద్ర …

రామా ~~~~

దాసమాన సాంబుజ విభాసమాన రామచంద్ర

భుసురాధిప నారసింహ దాస హృదయ శ్రీనివాస…2

….ఆరగించవయ్య రామ అతివ తోడను సీతమ్మతోడ..2

ఆరగించవయ్య రామ అతివ తోడను…3




కప్పురంపు విడెములివిగోను

 కప్పురంపు విడెములివిగోను

రచన: తూము నరసింహదాసు

రాగం: శంకరాభరణం, తాళం: మిశ్రచాపు

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు


Audio


పల్లవి:

కప్పురంపు విడెములివిగోను 

శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కెను 

కప్పురంపు విడెములివిగోను 

శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కెను 

నిపుణాతో సీత నెలత అందిచ్చెడి

…..కప్పురంపు విడెములివిగోను / 

…. కప్పురంపు విడెములివిగోను శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కెను…


చరణం:

పచ్చిపోకలు పండుటాకు లవంగాలు 

 హెచ్చైన ఏలకులు మిళితమై ఒప్పేడు

…..కప్పురంపు విడెములివిగోను / 

 ….కప్పురంపు విడెములివిగోను శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కేను…


కాచు నారీకేళ ఖండములు యెంతో 

రాచ యోగ్యమైన దాల్చిన యుతముగా

….కప్పురంపు విడెములివిగోను /

 ….కప్పురంపు విడెములివిగోను శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కెను…



పండు జాజి ఫలములు పలుచని జాపత్రి

దండిగా నరసింహదాసుడర్పించేటి

…..కప్పురంపు విడెములివిగోను /

 ….కప్పురంపు విడెములివిగోను 

శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కెను..2

నిపుణాతో సీత నెలత అందిచ్చెడి

కప్పురంబు విడెములివిగోను 

శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కెను…3….



జో జో రామ

 జో జో రామ

రచన: సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి

రాగం: రీతిగౌళ, తాళం:ఆది

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

(లాలి పాటలు)


Audio

పల్లవి:

జో జో రామ ..2 ఆనంద ఘన

జో జో రామ….


చరణం:

జో జో దశరథ బాల…2 రామ

జో జో భువిజ లోల రామ

జో జో రామ…..


జో జో రఘుకుల తిలక…2 రామ

జో జో కుటిల తరాలక రామ

జో జో రామ…..


జో జో నిర్గుణ రూప…2 రామ

జో జో సుగుణ కలాప రామ

జో జో రామ…..


జో జో రవి శశి నయన…2 రామ

జో జో ఫణి వర శయన రామ 

జో జో రామ…..


జో జో మృదుతర భాషా…2 రామ

జో జో మంజుల వేష రామ

జో జో రామ…..


జో జో త్యాగరాజార్చిత …2 రామ

జో జో భక్త సమాజ రామ

జో జో రామ ఆనంద ఘన

జో జో రామ…3


క్షీరసాగర విహార

 క్షీరసాగర విహార

రాగం: ఆనందభైరవి , తాళం:ఖండచాపు

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు


Audio

పల్లవి:

క్షీర సాగర విహార అపరిమిత ఘోర పాతక విదార

క్రూర జన గణ విదూర నిగమ సంచార సుందర శరీర


చరణం:

శత మఖాహిత విభంగ శ్రీరామ

శమన రిపు సన్నుతాంగ

శ్రిత మనవాంతరంగ జనకజా

శృంగార జలజ భృంగ


రాజాధి రాజ వేష శ్రీరామ

రమణీయ కర సుభూష

రాజనుత లలిత భాష శ్రీ త్యాగ 

రాజాది భక్త పోష


జయ జయ హారతి జానకి దేవికి

 జయ జయ హారతి జానకిదేవికి

రాగం: కాపి, తాళం: ఏక

గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు


Audio

పల్లవి:

జయ జయ హారతి జానకీదేవికి

జనక సుపుత్రికి కనకభూషణికి


అనుపల్లవి:

రాయి అయిన అహల్యను రమణిగా చేసిన రఘుకులనాధుని తరుణీమణికి

……జయ జయ హారతి జానకీదేవికి

జనక సుపుత్రికి కనకభూషణికి…..


చరణం:

ధరణీ సుతులకై దైత్యులణచిన

దశరథ తనయుని తరుణీమణికి

పసిడి పళ్ళెరమున బాగనమర్చిన

పరిమళ హారతి పద్మపూజితకు

…..జయ జయ హారతి జానకీదేవికి

జనక సుపుత్రికి కనకభూషణికి…

జనక సుపుత్రికి కనకభూషణికి…

జనక సుపుత్రికి కనకభూషణికి…