31, అక్టోబర్ 2016, సోమవారం

రమ్మని వనభోజనం కమ్మని వన భోజనం

రమ్మని వనభోజనం కమ్మని వన భోజనం
(కార్తీక మాసము పాట)
పుణ్య కార్తీక మందు కలుసుకుందామంటు ప్రేమతో పిలిచింది పూలవనము
భక్తి శ్రద్ధలతో కలసి విందామంటు ఆహ్వాన మందించే ఊరి జనము
ఐకమత్యము గూడి ఆధ్యాత్మిక తోడి
జగతి నడిచెడి ధర్మ మార్గ మెరిగి కలుసుకుందము రండి మిత్రులారా.
**********************************

పల్లవి :
రమ్మని వనభోజనం కమ్మని వన భోజనం
కార్తిక మాసంలో  పవిత్ర పంక్తి భోజనం

చరణం :
సాంప్రదాయములకు లక్ష్మీ దామోదర పూజలు
ఆధ్యాత్మిక పరిమళాల అలరు భక్తి సేవలు
ఉసిరి చెట్టు నీడన ప్రకృతితో సహజీవనం
పల్లెతల్లి ఒడిలో పరవశపు విందుభోజనం
….రమ్మని వన భోజనం…..

ఆటపాటలతో సందడి చేసే పసిపాపలు
ఆత్మీయత పంచు బందుమిత్రుల చిరునవ్వులు
కలిపి తీపి గురుతుగా మిగిలేటి విందు భోజనం
….రమ్మని వన భోజనం…..

బ్రతుకు నిచ్చు ప్రకృతి మాతకు చేసే వందనం
భేద భావములు నెరగని మానవీయ సంగమం
మన సంస్కృతి ఘన ప్రతీక సమ్మేళనం
ఇది తెలిసిన నాడే నిజమైన విందుభోజనం

రమ్మని వనభోజనం కమ్మని వన భోజనం
కార్తీక మాసంలో  పవిత్ర పంక్తి భోజనం

27, అక్టోబర్ 2016, గురువారం

జలజనయన శివశంకరా

జలజనయన శివశంకరా
(స్వరజని)
రచన : రామరాజుగారు,  
శుద్ద సావేరీ రాగం,  ఆదితాళము

పల్లవి :
జలజనయన శివ శంకరా హరా ఝణాం ఝణుతకిణాం తకిట ధిమి తక
చంద్రశేఖరా కలుషహరా
జలజనయన శివ శంకరా

చరణం :
గంగాధరా సుందరానన గౌరీమనోహరామరవినుత
జలజనయన శివ శంకరా

మనసిజహర సద్గుణధరా రజితగిరివిహార రణ సమ జయ కర
త్రిభువనవిహార కూమార జనక సూర
మధుర గాన లోల నీల గళ శివా
జలజనయన శివ శంకరా

అనుపమాన త్రిశూలధర మహేశ అతి నివాస కైలాసాధిపశివ నిగమ వినుత ఖగపతి నుత
శశిధర హర గిరిజవరామరవినుతపద
జలజనయన శివ శంకరా

శంభో హరహరహరమర ప్రారంభోత్సవ సంతోషాత్మ,  గంభీరస చంఢీశ్వర నంధీశ్వర బృంగీశ్వర విఘ్న వినాయక  దేవగణార్చితపద మౌని జప ఫలానందాకరా
నమో నమో అఘ విమోచన సాంబ కపాలధర అపార కృపమయ శివ
జలజనయన శివ శంకరా

శాంభవి రమణ జయ జయ హర శంభో పాపహరణ పంచాక్షరీ మంత్ర జపఫల పంచాధీశా సంతోష శివశివ రజిత గిరి నివాస సరసిజ భవార్చిత చరణ గురుగుహపిత ఘన పరంజ్యోతి శివ పరాత్పర సుగుణ రామరాజ హృద్విలాస హరహర

జలజనయన శివ శంకరా హరా ఝణాం ఝణుతకిణాం తకిట ధిమి తక చంద్రశేఖరా కలుషహరా

జలజనయన శివ శంకరా

21, అక్టోబర్ 2016, శుక్రవారం

శంకరా శివశంకరా శివశంకరా శంభో

శంకరా శివశంకరా శివశంకరా శంభో

చక్రవాకం రాగం , ఏకతాళం


Audio


శంకరా శివశంకరా శివశంకరా శంభో
శంకరా అభయంకరా శివశంభో మహదేవ

ఢమ ఢమ ఢమ ఢమరు భజే
శివ ఘణ ఘణ ఘణ ఘంటా భజే
ఢమ ఢమ ఢమ ఢమరు భజే
శంకర ఘణ ఘణ ఘణ ఘంటా భజే
ఢమ ఢమ ఢమ ఢమరు భజే
శంభో ఘణ ఘణ ఘణ ఘంటా భజే
ఢమ ఢమ ఢమ ఢమరు భజే
మహదేవ ఢమ ఢమ ఢమ ఢమరు భజే

హర భోలేనాధ శంభో విశ్వేశ్వరాయ శంభో
హర హర భోలేనాధ శంభో చంద్రశేఖరాయ శంభో
హర హర భోలేనాధ శంభో
సత్యసాయినాధ శంభో
హర హర భోలేనాధ శంభో శిరిడి సాయి నాధ శంభో

శంకరా శివశంకరా శివశంకరా శంభో
శంకరా అభయంకరా శివశంభో శంకరా శివశంకరా శివశంకరా శంభో

కాశీపతే వారణాశీ పతే

కాశీపతే వారణాశీ పతే
శివరంజని రాగం,  ఆది తాళం



కాశీపతే వారణాశీ పతే
గంగా జటాఝూట గౌరీపతే
సర్వుల పాలించు సదా పశుపతే
గతి మాకు నీవయ్య గిరిజా పతే
...కాశీపతే….


భోళా శంకర హర గంగాధర
ఆనందకారణ విహార హర
అర్ధనారీశ్వర మహదేవ శంకర
ఆదుకో రావయ్య పరమేశ్వరా
….కాశీపతే…


కాశి కాశి యనగ నశియించు పాపములు
కాశీవాసుల భాగ్యమే భాగ్యము
తారక మంత్రమిది తరియింప చేతువట
సదా నిను తలచు మది కాశీయగునట


కాశీపతే వారణాశీ పతే
గంగా జటాఝూట గౌరీపతే
కాశీపతే వారణాశీ పతే
వారణాశీ పతే

వారణాశీ పతే

20, అక్టోబర్ 2016, గురువారం

హర హర శంభో గౌరీశా

హర హర శంభో గౌరీశా
Audio
హర హర శంభో ...శివ శివ శంభో గౌరీశా
హర హర శంభో ...శివ శివ శంభో జయ జయ శంభో గౌరీశా

తుంగ జటాధర గౌరీశా ...పుంగవ వాహన గౌరీశా
తుంగ జటాధర పుంగవ వాహన గంగాధర గౌరీశా

దక్షమ దాసహ గౌరీశా శిక్షిత మన్మధ గౌరీశా
దక్షమ దాపహ శిక్షిత మన్మధ భిక్షాటన పర గౌరీశా

బ్రహ్మ శిరోహర గౌరీశా ..కల్మష నాశన గౌరీశా
బ్రహ్మ శిరోహర కల్మష నాశన షణ్ముక జనకా గౌరీశా

ఇంద్ర నిశేవిత గౌరీశా.. చంద్ర కళాధర గౌరీశా
ఇంద్ర నిశేవిత చంద్ర కళాధర చంద్రమ దాపహగౌరీశా

ఫాల విలోచన గౌరీశా.. కాల వినాశన గౌరీశా
ఫాల విలోచన కాల వినాశన నీల గళామయా గౌరీశా

అద్భుత వైభవ గౌరీశా ...చిత్పురుషేశ్వర గౌరీశా
అద్భుత వైభవ చిత్పురుషేశ్వర కల్పిత భువనా గౌరీశా

అచ్యుత సహచర గౌరీశా… విచ్యుత కలిమల గౌరీశా
అచ్యుత సహచర విచ్యుత కలిమల నిర్మల హృదయ గౌరీశా

నిశ్చల నిష్కల గౌరీశా...నిత్య నిరామయ గౌరీశా
నిశ్చల నిష్కల నిత్య నిరామయ నిశ్చల నిరుపమ గౌరీశా

పన్నగ భూషణ గౌరీశా...పాప విమోచన గౌరీశా
పన్నగ భూషణ పాపవిమోచన.  కిన్నెర సేవిత గౌరీశా

హర హర శంభో ...శివ శివ శంభో గౌరీశా
హర హర శంభో ...శివ శివ శంభో గౌరీశా

శివోహం నిర్వాణ శతకం

శివోహం నిర్వాణ శతకం
Audio
శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం |

మనో బుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
చిదానంద రూపం శివోహం శివోహం ||

అహం ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః |
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపం శివోహం శివోహం ||

న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపం శివోహం శివోహం ||

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మన్త్రో న తీర్ధం న వేదా న యజ్ఞః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపం శివోహం శివోహం ||

న మృత్యు ర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః|
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపం శివోహం శివోహం ||
అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |
న వా బన్దనం నైవ ముక్తి న బంధః |
చిదానంద రూపం శివోహం శివోహం
చిదానంద రూపం శివోహం శివోహం
చిదానంద రూపం శివోహం శివోహం
చిదానంద రూపం శివోహం శివోహం

శివుడు తాండవము చేయునమ్మా

శివుడు తాండవము చేయునమ్మా
Audio
శ్రీరాగం , ఆదితాళం
పల్లవి :
శివుడు తాండవము సేయునమ్మ.
శివుడు తాండవము సేయునమ్మ కైలాసగిరిలో
శివుడు తాండవము సేయునమ్మా

చరణం :
శివుడు తాండవము సేయును నిత్యము
అవిరళముగ జగదాంబ ముందర
..శివుడు తాండవము చేయునమ్మా…

సరస్వతి వీణ వాయించంగా  
లయ తప్పకుండా బ్రహ్మ తాళము వేయుచుండా
సారస గతులను సప్త తాళముల
భావము పుట్టగ ప్రదోష వేళ
….శివుడు తాండవము చేయునమ్మా…..

మురళి దేవేంద్రుడె పూరింపంగ
నారాయణ మూర్తి మురియుచు మద్దెలు వాయింప
తకధిమి తద్ధిమి తోంధిమి అనుచు
భరత శాస్త్రమును పలికిన రీతుల

శివుడు తాండవము సేయునమ్మ
కైలాస గిరిలో
శివుడు తాండవము సేయునమ్మ
శివుడు తాండవము సేయునమ్మ
శివుడు తాండవము సేయునమ్మ

ఘల్లు ఘల్లున

ఘల్లు ఘల్లున
ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ
కలహంస నడకల కలికి ఎక్కడికే….2
జడలోన గంగను ధరియించుకొన్నట్టి
జగమేలే సాంబశివుని సన్నిధికే
మంగళం మంగళం..
మాతల్లికి మంగళం మంగళం.

తళ తళమని రత్న తాటంకములు మెరయ
పసిడి కుండళముల పడతి ఎక్కడికే…2
కరిచర్మాంబర ధరుడు మురహరుడైనట్టి
గురుడైన భోళాశంఖరుని సన్నిధికే
మంగళం మంగళం
మాతండ్రికి మంగళం  మంగళం

చెంగావి చీరలు కొంగులు జారంగ
రంగైనా నవమోహనాంగి ఎక్కడికే..2
పులితోలు వస్త్రము విభూతి ధరియించిన
మండలమేలే జగదీశుని సన్నిధికే
మంగళం మంగళం
మాతల్లికి మంగళం మంగళం

బొడ్డు మల్లెలు జాజిదండలు మెడనిండ
అందమెరిగిన జగదాంబ ఎక్కడికే ?
అందముగా విభూతి నలరు శ్రీగ్రంధము
అలరీన నీలకంఠేశుని సన్నిధికే
మంగళం మంగళం
మా తండ్రికీ మంగళం మంగళం

హెచ్చు పాపిటబొట్టు రత్నకిరీటము
ఈవేళ కరుణా కటాక్షి ఎక్కడికే...2
కడుపెద్ద రుద్రాక్షలు మెడలోన హరములు
శిఖరాన వెలసిన శివుని సన్నిధికే
మంగళం మంగళం
మాతల్లికీ మంగళం మంగళం
మాతండ్రికి మంగళం మంగళం.

19, అక్టోబర్ 2016, బుధవారం

ఈశ్వరాజ్ఞ ఏమో eeswaragna emo

ఈశ్వరాజ్ఞ ఏమో eeswaragna emo
రచన : శ్రీ మళై కొండ రామదాసు,  సంగీతం : బాల మురళి కృష్ణా సింధు భైరవి రాగం,  రూపక తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
శ్వరాజ్ఞ ఏమో తెలియదు
అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
చరణం :

శాశ్వత ఐశ్వర్య మిచ్చి సదా నన్ను బ్రోచునో

సకల భాధలను పెట్టి సంకట పడచూచునో…..పరమేశ్వరాజ్ఞ…..

నందనునిగ భావించి నన్ను గారవించునో

నలుగురి లోపల మిక్కిలి నగుబాటొనరించనో

…..పరమేశ్వరాజ్ఞ…..

ధారుణిలో నను భగవత్ దాస కోటి చేర్చునో

ధార పుత్రాది వలలో తగులు కొనగా కూర్చునో

…..పరమేశ్వరాజ్ఞ….

కూరిమితో సుదర్శనము గొప్పున దయ చేయునో

కొరమాలిన మానవులను కొనుయాడగ చేయునో

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు

అది ఎవరెరగరు ఈశ్వరాజ్ఞ

అది ఎవరెరగరు ఈశ్వరాజ్ఞ

అది ఎవరెరగరు ఈశ్వరాజ్ఞ


ఏమి సేతుర లింగా

ఏమి సేతుర లింగా

నాదనామక్రియ రాగం, ఆదితాళము


పల్లవి :

ఏమి సేతుర లింగా ఏమి సేతురాఏమి సేతుర లింగా ఏమి సేతురా


చరణం :

గంగ ఉదకము తెచ్చినీకు లింగ పూజను చేదమంటే..ఏ..ఏ..ఏ.

గంగ ఉదకము తెచ్చినీకు లింగ పూజను చేదమంటే..

గంగలోన చేప కప్ప ఎంగిలంటున్నాయి లింగా

మహానుభావ మాలింగమూర్తి మాదేవశంభో..ఓ...ఓ...ఓ

ఏమి సేతుర లింగా ఏమి సేతురా

తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూ చేదమంటే….ఏ..ఏ…ఏ...ఏ..

తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూ చేదమంటే

కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా…మహానుభావ మాలింగమూర్తి మాదేవశంభో..ఓ...ఓ...ఓఏమి సేతుర లింగా ఏమి సేతురా

అక్షయావుల పాడి తెచ్చి అర్పితము సేదమంటే….ఏ..ఏ..ఏఅక్షయావుల పాడి తెచ్చి అర్పితము సేదమంటేఅక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగామహానుభావ మాలింగమూర్తి మాదేవశంభో..ఓ...ఓ...ఓ

ఏమి సేతుర లింగా

ఏమి సేతురాఏమి సేతుర లింగా ఏ..మి సేతురా….ఏమి సేతుర లింగా ఏ..మి సేతురా….

ఏ..మి సేతురా…...ఏ..మి సేతురా….



శివశంకర శివశంకరా

శివశంకర శివశంకరా

శివరంజని రాగం, రూపకతాళం

శంకర శివశంకరా శంకరహర మహాదేవ
శివ శంకర శివశంకరా శంకరహర మహాదేవ
శివ శంకర శివశంకరా శంకరహర మహాదేవ
శివ శంకర శివశంకరా శంకరహర మహాదేవ
శివశంకరా..శంకరహర… మహాదేవ

భవబంధ విమోచన. .. అ…..అ…..
భవబంధ విమోచన...అ…..అ….
భవబంధ విమోచన పాపహరణ పశుపతీశ
భవబంధ విమోచన పాపహరణ పశుపతీశ
శివశంకర శివశంకరా శంకరహర మహాదేవ
శివశంకరా..శంకరహర… మహాదేవ

అపదోద్ధార ఆత్మజీవ సంరక్షక
అపదోద్ధార ఆత్మజీవ సంరక్షక
సకలంబును నీవే  గావ...అ...అ..అ..అ..
సకలంబును నీవే  గావ..
సకలంబును నీవేగావ బాపన కవి సన్నుత
సకలంబును నీవేగావ బాపన కవి సన్నుత

శివశంకర శివశంకరా శంకరహర మహాదేవ
శివశంకర శివశంకరా శంకరహర మహాదేవ

శివశంకరా..శంకరహర… మహాదేవ….

శివశివశివ శివశివయనుడీ

శివశివశివ శివశివయనుడీ
రచన: శ్రీకూచమంచి సోమసుందర కవి, స్వరకల్పన : శ్రీ వేమూరి సరోజనీ శాస్త్రి , బేహాగ్ రాగము, ఆదితాళము


పల్లవి :
శివశివశివ శివశివయనుడీ
లవమైనను జాలము సేయకరండీ
...శివ….


చరణం :
వివిధ శాస్త్రములు వెదకి చూచినను
భవ తరణమునకుపాయము లేదిక
…..శివ……


కాలము వ్యర్ధముగానొనర్చి తుద
కాలకింకరుల పాలు గాకయిక
….శివ....


దేహమచలమని తెలివి గలిగి ఘన
మోహభ్రాంతిని మోసపోక యిటు
….శివ…


ఇరువుగ బలివెలపురినుండెడి శ్రీవరుని
గొప్పు లింగని మది దలచుచు
…..శివ….


తప్పక సుందర దాసుం
డిప్పుడు చెప్పిన సుద్దుల నొప్పుగ గైకొని
శివశివశివ శివశివయనుడీ
లవమైనను జాలము సేయకరండీ
శివశివశివ శివశివయనుడీ
శివశివశివ శివశివయనుడీ