శ్రీరామ జయరామ
యదుకుల కాంభోజి రాగం
ఖండచాపు తాళం
త్యాగరాజ స్వామి వారి దివ్యనామ సంకీర్తన
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
పల్లవి :
శ్రీరామ జయరామ శృంగార రామ యని
శ్రీరామ జయరామ శృంగార రామ యని చింతింపరాదే ఓ మనసా
చరణం :
తళుకు చెక్కుల ముద్దుబెట్ట కౌసల్యమును తపమేమి చేసెనో కౌసల్య
తపమేమి చేసెనో తెలియా...ఆ..ఆ….ఆ..ఆ……
ధశరథుడు శ్రీరామ రారా యని పిలువమును తపమేమి చేసెనో ధశరథుడు తపమేమి చేసెనో తెలియా...ఆ..ఆ…...ఆ..ఆ……
తనివార పరిచర్య చేయ సౌమిత్రిమును తపమేమి చేసెనో సౌమిత్రి తపమేమి చేసెనో తెలియా...ఆ..ఆ...ఆ...ఆ….
తన వెంట చన జూచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో కౌశికుడు తపమేమి చేసెనో తెలియా...ఆ..ఆ..ఆ..ఆ….
తాపంబణగి రూపవతియౌట కహల్య తపమేమి చేసెనో అహల్య తపమేమి చేసెనో తెలియా...ఆ..ఆ...ఆ..ఆ…..
ధర్మాత్మ చరణంబు సోక శివచాపంబు తపమేమి చేసెనో చాపంబు
తపమేమి చేసెనో తెలియా..ఆ..ఆ..ఆ...ఆ…..
తన తనయ నొసగి కనులార గన జనకుండు
తపమేమి జేసెనో జనకుండు తపమేమి జేసెనో తెలియా...ఆ...ఆ...ఆ...ఆ….
దహరంబు కరగా కరము బట్ట జానకి తపమేమి చేసెనో జానకి తపమేమి చేసెనో తెలియా..ఆ..ఆ..ఆ...ఆ…..
త్యాగరాజాప్తాయని పొగడ నారదమౌని తపమేమి చేసెనో ఆ మౌని తపమేమి చేసెనో తెలియా..ఆ...ఆ...ఆ...ఆ…...
శ్రీరామ జయరామ శృంగార రామయని చింతింపరాదే ఓ మనసా