28, జూన్ 2018, గురువారం

Jaya kodanda rama జయ కోదండ రామ

జయ కోదండరామ
రాగం:తిల్లాంగ్ ,తాళం:ఆది/ఏక
స్వర రచన : శ్రీమతి వేమూరి సరోజిని శాస్త్రీగారు
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
కోరస్ :
జయ జయ రామ …..జానకిరామా
హనుమత్ సేవిత రఘురామ

పల్లవి:
జయ కోదండరామ కరుణించరా……
దశరధ తనయ దయతోడ బ్రోవరా
...జయ కోదండరామ….
జయ జయ రామ …..జానకిరామా
హనుమత్ సేవిత రఘురామ

చరణం:
కళ్యాణరామ కరుణించరారా
తాటక మర్ధన హే రామ రామ
తాపస రక్షక కరుణించరారా
సీతారామ శ్రీరఘురామ
సీతారామ శ్రీరఘురామ
….జయ కోదండరామ కరుణించరా
దశరధ తనయ దయతోడ బ్రోవరా
జయ కోదండరామ….
జయ జయ రామ …..జానకి రామా
హనుమత్ సేవిత రఘురామ

వాలి మదహర హే రామ రామ
వానర రక్షక శ్రీరామ రామ
రావణ సంహార హే రామ రామ
తాడ్బందు పురపతిని పాలించు రామ
తాడ్బందు పురపతిని పాలించు రామ...
(పట్టాభిరామ పాలించరారా
పట్టభిరామ పాలించరారా.....)
…..జయ కోదండరామ కరుణించరా
దశరధ తనయ దయతోడ బ్రోవరా
జయ కోదండరామ….
జయ జయ రామ …..జానకిరామా
హనుమత్ సేవిత రఘురామ
హనుమత్ సేవిత రఘురామ
హనుమత్ సేవిత రఘురామ‌…..

24, జూన్ 2018, ఆదివారం

Ramuni maravakave రాముని మరవకవే

రాముని మరవకవే
త్యాగరాజ దివ్య నామ సంకీర్తన
రాగం: కేదారగౌళ, తాళం : ఆది


Audio
పల్లవి :
రాముని మరవకవే …….
రాముని మరవకవే మనసా
రాముని మరవకవే
సీతారాముని మరవకవే

చరణం:
రాముని యాగము గాచిన పాపవిరాముని సద్గుణ ధాముని…..సీతా
రాముని మరవకవే……..

ధీరుని దైత్య విదారుని లోకాధారుని వంశోద్ధారుని...సీతా
రాముని మరవకవే…...

శీలిని సద్గుణ శాలిని ఘనుని కపాలి నుతుని వనమాలిని…సీతా
రాముని మరువకవే..‌‌‌

వాసవ హృదయ నివాసుని బహు రవి భాసుని శుభకర వేషుని…..సీతా
రాముని మరవకవే…...

శ్రీగురు చరణములే గతి యనిన సదా గతిజ హితుని త్యాగరాజనుత ...రాముని మరవకవే ...
మనసా రాముని మరవకవే
సీతారాముని మరవకవే
సీతారాముని మరవకవే
సీతారాముని మరవకవే……….

17, జూన్ 2018, ఆదివారం

Annamaihku mangalam అన్నమయ్యకు మంగళం

అన్నమయ్యకు మంగళం
సురటి రాగం
Audio
పల్లవి :
అన్నమయ్యకు మంగళం
హరి భక్తునకు మంగళం

చరణం :
చెన్ను మీరగను వేలకీర్తనల
భక్తి మీరగను గానము చేసిన
అన్నమయ్యకు మంగళం
హరి భక్తునకు మంగళం

భక్తి ఙ్ఞాన వైరాగ్య సంపదల
పంచిపెట్టుటకు అవతరించిన
అన్నమయ్యకు మంగళం
హరి భక్తునకు మంగళం

అలమేల్మంగకు ముద్దుబిడ్డడు
పదకవితా పితామహుడు (శ్రీ)
అన్నమయ్యకు మంగళం
హరి భక్తునకు మంగళం

వేంకటేశ్వరుని పాదము లీడక
పదములు పాడిన భక్తాగ్రేసరుడు
అన్నమయ్యకు మంగళం
హరి భక్తునకు మంగళం

భ్రమర కీటక న్యాయము వోలె
శ్రీనివాసునిలో లీనమైన
అన్నమయ్యకు మంగళం
హరి భక్తునకు మంగళం

Endagani need a can I. ఎండగాని నీడగాని

ఎండగాని నీడగాని
రాగం : నీలాంబరి ,తాళం : ఆది
Audio
పల్లవి :
ఎండగాని నీడగాని ఏమైనాగాని
కొండలరాయుడే మా కులదైవము

చరణం :
తేలగాని పాముగాని దేవ పట్టయినగాని
గాలిగాని ధూళిగాని కానియేమైనా
కాలకూట విషమైన గక్కున మింగిన నాటి
నీలవర్ణుడే మా నిజదైవము..

చీమగాని దోమగాని చెలది యేమైనగాని
గాముగాని నాముగాని కానియేమైనా
పాములనిన్నిటి మింగే బలుతేజి పై నున్న
ధూమకేతువే మా దొర దైవము

పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైనాగాని
కల్లగాని పొల్లగాని కానియేమైనా
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడే
మమ్మెల్ల కాలమును ఏలే ఇంటి దైవము.

…..‌‌‌పల్లవి……...మా నిజదైవము….మా దొరదైవము…..మా ఇంటి దైవము

Timmireddy many niche తిమ్మిరెడ్డి మాకునిచ్చె

తిమ్మిరెడ్డి మాకు నిచ్చె
ఆరభి రాగం ,ఆదితాళం
స్వర రచన : శ్రీ సత్తిరాజు వేణుమాధవ్
Audio
పల్లవి :
తిమ్మిరెడ్డి మాకు నిచ్చె …...ఏ...ఏ….
తిమ్మిరెడ్డి మాకు నిచ్చె దిష్టమైన పొలము
బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసె బొలము

చరణం:
నిండి నట్టి మడుగుల నీరు వంక పొలము
కొండలు మోచిన పెద్ద గొబ్బరపు పొలము
అండనే పొలము రాజులుండేటి పొలము
చెండి వేసి మాకు నెల్ల సెలగిన పొలము

అసపడి వరదానమడిగిన పొలము
బాసలతో గడు నెత్రు పట్టమైన పొలము
రాసికెక్కి మునులకు రచ్చైన పొలము
వేసరక నాగేట వేగిలైన పొలము

మంచి గురుతైన రావి మాని చేని పొలము
వంచిన గుఱ్ఱము తోలే వయ్యాళి పొలము
యెంచగ శ్రీ వేంకటేశు నిరవైన పొలము
పంచుకొని లోకులెల్లా బ్రదికేటి పొలము

16, జూన్ 2018, శనివారం

Vadala vadala vents vasantamu వాడల వాడల వెంట వసంతము

వాడల వాడల
శ్రీరాగం , ఆదితాళం
స్వర రచన : శ్రీ బాలచంద్ర ప్రసాద్ గారు

Audio
పల్లవి :
వాడల వాడల వెంట వసంతము
జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ

చరణం :
కలికి నవ్వులె నీకు కప్పుర వసంతము
వలచూపు కలువల వసంతము
కులికి మాటాడినదే కుంకుమ వసంతము
చలమున చల్లె నీపై జాజర జాజర జాజ

కామిని జంకెన నీకు కస్తూరి వసంతము
వాముక మోహపు నీటి వసంతము
బూమెల సరసముల పుప్పొడి వసంతము
సామజ గురుడ నీపై జాజర జాజర జాజ

అంగన అధరమిచ్చి అమృత వసంతము
సంగడి శ్రీ వేంకటేశ సతి గూడితి
ముంగిటు రతి చెమట ముత్తేల వసంతము
సంగతాయ నిద్దరికి జాజర జాజర జాజ

Sandekada buttinatti సందెకాడ బుట్టినట్టి

సందెకాడ పుట్టినట్టి
రాగం :రామక్రియ , తాళం: పల్లవి..చతురస్ర , చరణాలు ...తిశ్రం
మధ్యమం….Audio
పల్లవి :
సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంతచందమాయ చూడరమ్మా చందమామ పంట

చరణం :
మునుప పాలవెల్లి మొలచి పండిన పంట
నినుపై దేవతలకు నిచ్చపంట
గొనకొని హరికన్ను గొన చూపుల పంట
వినువీధి నెగడిన వెన్నెలల పంట

వలరాజు పంపున వలపు విత్తిన పంట
చలువై పున్నమ నాటి జాజర పంట
కలిమి కామిని తోడ కారుకమ్మిన పంట
మలయుచు తమలోని మఱ్ఱిమాని పంట

విరహుల గుండెలకు వెక్కసమైన పంట
పరగ చుక్కల రాసి భాగ్యము పంట
అరుదై తూరుపు కొండ నారగ పండిన పంట
యిరవై శ్రీవేంకటేశు నింటిలోని పంట

Suvvi suvvi suvvani సువ్వి సువ్వి సువ్వని

సువ్వి సువ్వి సువ్వని
కేదారగౌళ రాగం , ఆదితాళం
స్వర రచన : శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ
Audio
సువ్వి సువ్వి సువ్వని
సుదతులు దంచెదరోలాల

వనితలు మనసులు కుందెన చేసిటు
వలపులు తగనించోలాల
కను చూపుల నెడు రోకండ్లను
కన్నెలు దంచెదరోలాల

బంగరు చెరగుల పట్టు పుట్టములు
కొంగులు దూలగనోలాల
అంగనలందరు నతి వేడుకతో
సంగడి దంచెదరోలాల

ఘల్లు ఘల్లుమను కంకణరవముల
పల్లవ  పాణుల వోలాల
అల్లన నడుములు అసియాడుచు
సతులొల్లనె దంచెదరోలాల

కప్పుర గంధులు కమ్మని పువ్వుల
చప్పరములలో నోలాల
తెప్పలుగా రతి తేలుచు
కోనేటప్పని పాడెదరోలాల