28, ఫిబ్రవరి 2017, మంగళవారం

Sogasulanni cheri సొగసులన్ని చేరి గోదాదేవి పాశురం -10

గోదాదేవి పాశురం-10
సొగసులన్ని చేరి నిన్ను
రచన : డా.పి.యల్.యన్.ప్రసాదుగారు
గానం, సంగీతం : యం.యశోధరగారు
యమన్ కళ్యాణి రాగం

సొగసులన్ని చేరినిన్ను కొలిచేనే ఓ సఖియా
పలుకు తేనెల తల్లి పలుకక నిదురేలనే
…….సొగసులన్ని. …….

కోటి పున్నముల మూట సీతమ్మ నీవైతివి
పున్నమి చందురుడు రామయ్య ఒడి నిదుర నిన్ను చేరేనా
పలుకే బంగారమా పలుకకా నిదురేలనే మధురాక్షీ నీకు
రామయ్య చే కూలిన కుంభకర్ణుడి నిదురే నిను చేరేనా
…...సొగసులన్ని …….

తెరచిరావే చెలియా తెల్లవారెను
తలుపులు తెరిచి మాధవుని తలచి
పెదవిలను తెరిచి పలుకవే భామా
యమునలో మునిగి నోమును నోచవే
లోకాలకిదే సౌభాగ్య కారకం
కన్నెలందరికిదే కళ్యాణ కారకం

సొగసులన్ని చేరినిన్ను కొలిచేనే ఓ సఖియా
పలుకు తేనెల తల్లి పలుకక నిదురేలనే…...2Audio

Melukonave maru malli గోదాదేవి పాశురం -9 మేలుకొనవే మరుమల్లె

పాశురం-9
మేలుకొనవే మరుమల్లె
రచన : డా.పి.యల్.యన్.ప్రసాదుగారు
గానం,సంగీతం:యం.యశోధరగారు
శంకరాభరణరాగం
Audio
మేలుకొనవే మరుమల్లె మేలుకొనవే..2
మురిపాల మాధవుని మహిలోన కనవే
….మేలుకొనవే  ..

దీపాలు ధూపాలు పందిరి మంచాలు పట్టుదుప్పట్లు పరువాల కలలు
కలలోనే క్రిష్ణుని ముచ్చట్ల తోడ
కలవరించేవే కులుకులా కామాక్షి

కాకికి కబురెట్టి కనురెప్ప మూయవే
కోడితో చెలరేగి తొలిజాము నిలువవే
అత్తలే అరచిన అతివ నువ్వు నవ్వేవు
అదిరేటి చప్పుళ్ళు నీను లేపలేవా
….మేలుకొనవే మరుమల్లె….

వీనుల వినరాదు వింతకాదా మాయలే కమ్మేనా మదిరాక్షి నిన్ను
మంత్రాలు మాయలే కమ్మినా కాని మాయదారి మాధవుడు వీడే మనకేమి  భయము
కన్నయ్య కొలువుండే కన్నెలారా
కొంగు బంగారమునే కొంగునా కట్టరే

మేలుకొనవే మరుమల్లె మేలుకొనవే
మురిపాల మాధవుని మహిలోన కనవే
మేలుకొనవే మరుమల్లె మేలుకొనవే

Kesavudadina గోదాదేవి పాశురం-8 కేశవుడాడిన

8. గోదాదేవి పాశురం
కేశవుడాడిన
రచన :డా.పి.యల్.యన్.ప్రసాదుగారు
గానం, సంగీతం,: యం.యశోధరగారు
హమీర్ కళ్యాణి రాగం
Audio
కేశవుడాడిన వనసీమలవియే
కేశినే మర్ధించు రణ క్రీడలివిగో
మోహనాకారుడే మోహింప రావే
మత్తు వదలవే మీనాక్షీ నీవు
…..కేశవుడాడిన….

పాడి పశువుల తోడు పరిగెత్తె హరిని
యమునలో మునిగి యాదవుల కూడి
చానూర ముష్టికుల సంహరించిన ఆనీల మేఘుని నీ వాకిట నిలిపేము
మేము నీవాకిట నిలిపేము
…….కేశవుడాడిన……

హరి మనసునే గెలిచి హరిని చేపట్ట
మార్గళీ నోములే మనకిక మార్గంబు
కాత్యాయని కరుణ కన్నెలేె పొందగా లోకాలకిదే సౌభాగ్యదాయకం కన్నెలందరికి కళ్యాణ కారకం…
...కేశవుడాడిన…...

Endukaya sambhasiva ఎందుకయా సాంబశివ


ఎందుకయా సాంబశివ
ఏకతాళం , మాయ మౌళవ గౌళ రాగం
రచన :దేవులపల్లి క్రిష్ణశాస్త్రీగారు
Audio
పల్లవి :
ఎందుకయా సాంబశివ……
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా…..2
నీ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
నీ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ

చరణం :
అలల తోటి గంగ పట్టి తలపాగా చుట్టి...2
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగా పెట్టి
ఎందుకయా సాంబశివ…….నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగా పెట్టి
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ

తోలు కట్టి పటకాగా కాలాగ్ని కుట్టి...2
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివ…….
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ

రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర...2
ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయా
ఎందుకయా సాంబశివ…..
ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయా
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా…..2
నీ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
నీ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ
సాంబశివ సాంబశివ ...సాంబశివ సాంబశివ

23, ఫిబ్రవరి 2017, గురువారం

Isha girisha ఈష గిరీష


ఈష గిరీష
Audio
Isha Girisha naresha paresha Mahesha bhileshaya bhooshana bho
ఈష గిరీష నరేష పరేష మహేష భిలేషయ భూషణ భో
Samba Sadashiva Shambho Sankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం
Umaya divyasumangala vigrahayalingitha vamaanga vibho
ఉమయ దివ్య సుమంగళ విగ్రహయాలింగిత వామాంగ విభో
Samba Sadashiva Shambho Sankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర
శరణం మే తవ చరణయుగం

UriKuru mamaajnamanadham durikurume durithambho
వూరీ కురుమా మజ్ఞామానాధం
దూరికురిమే దురితం భో
Samba Sadashiva Shambho Sankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర
శరణం మే తవ చరణయుగం
శివాయనమ ఓం శివాయనమః శివాయనమ ఓం నమఃశివాయ
శివాయనమ ఓం శివాయనమః శివాయనమ ఓం నమఃశివాయ

Rishivara manasa hamsa chara chara janana sthithi laya karana bho
ఋషివర మానస హంస చరాచర జనన స్ధితి లయ కారణ భో
Samba Sadashiva Shambho Sankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర
శరణం మే తవ చరణయుగం

Anthahkarana vishudhim bhakthim chathwayi sathim pradehi vibho
అంతఃకరణ విశుద్ధిం భక్తిం చక్త్వై సతిం ప్రదేహి విభో
Samba Sadashiva Shambho Sankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర
శరణం మే తవ చరణయుగం
Karunavarunalaya mayi dasa udhasa sthavochitho na hi bho
కరుణా వరుణాలయ మయి దాస ఉదాస స్థవోచితో నహి భో
Samba Sadashiva Shambho Sankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర
శరణం మే తవ చరణయుగం
శివాయనమ ఓం శివాయనమః శివాయనమ ఓం నమఃశివాయ
శివాయనమ ఓం శివాయనమః శివాయనమ ఓం నమఃశివాయ

Jaya Kailasa nivasa pramatha ganadhisha bhoosuraarchitha bho
జయ కైలాస నివాస ప్రమథ గణాధీష భూసురార్చిత భో
Samba Sadashiva Shambho Sankara sharanam may thava
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం
Janutha kaja kingkinu jhanuthat shabdhair natasi maha nata bho
జనుథకజ కింగిను జనుతట్కిట శబ్ధైర్ నటసి మహా నట భో
Samba Sadashiva Shambho Sankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం
Dharmasthapana Daksha trayaksha guro Daksha yajna shikshaka bho
ధర్మస్ధాపన దక్ష త్ర్యైక్ష గురో దక్ష యజ్ఞ శిక్షక భో
Samba Sadashiva Shambho Sankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

శివాయనమ ఓం శివాయనమః శివాయనమ ఓం నమఃశివాయ
శివాయనమ ఓం శివాయనమః శివాయనమ ఓం నమఃశివాయ

Balamaarogyam chaayustwadguna ruchithaam chiram pradehi vibho
బలమారోగ్యం ఛాయుస్తద్గుణ రుచితాం చిరం ప్రదేహి విభో
Samba Sadashiva Shambho Sankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

Bhagawanbharga bhayapaha bhutapathe bhoothibhooshithanga vibho
భగవన్ భర్గ భయాపహ భూతపతే భూతి భూషితాంగ విభో
Samba Sadashiva Shambho Shankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం
Sarva deva sarvothama sarvada durvritha garva harana vibho
సర్వ దేవ సర్వాత్తమ సర్వద దుర్విత గర్వ హరణ విభో
Samba Sadashiva Shambho Sankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

శివాయనమ ఓం శివాయనమః శివాయనమ ఓం నమఃశివాయ
శివాయనమ ఓం శివాయనమః శివాయనమ ఓం నమఃశివాయ

Sathyam jnanamanantham brahme thye thallakshana lakshitha bho
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మి తే తల్లక్షణ లక్షిత భో
Samba Sadashiva Shambho Shankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

Haahaa hoohoo mukha sura gayaka gita padana padya vibho
హా హా హు హు ముఖ సుర గాయక గీత పదాన పద్య విభో
Samba Sadashiva Shambho Sankara sharanam may thava charanayugam
సాంబ సదాశివ శంభో శంకర
శరణం మే తవ చరణయుగం

శివాయనమ ఓం శివాయనమః శివాయనమ ఓం నమఃశివాయ
శివాయనమ ఓం శివాయనమః శివాయనమ ఓం నమఃశివాయ

17, ఫిబ్రవరి 2017, శుక్రవారం

Itadena ఇతడేనా

ఇతడేనా
సాలగ భైరవి రాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు.
Audio
పల్లవి :
ఇతడేనా ఈ లోకములోగల అతిధుల నెల్లను పాలనసేయు వాడితడేనా….2. .ఆ...ఆ….

చరణం :
పరిపూర్ణ కరుణచే …….
పరిపూర్ణ కరుణచే ప్రహ్లాదు గాచిన నరసింహుడైనట్టి నళిన దళేక్షుడు ఇతడేనా…….
...ఇతడేనా….

అలనాడు ద్రౌపతికి……
అక్షయ వలువలు వలనొప్ప నొసగిన వైకుంఠవాసుడు / నాధుడు ఇతడేనా
…….ఇతడేనా……

పాయని దయతో…….
పాయని దయతో ఆపన్నుల గాచిన రామదాసు నేలు రామచంద్ర ప్రభు...2

ఇతడేనా ఈ లోకములోగల అతిధులనెల్లను పాలనసేయు వాడితడేనా….2. .
ఇతడే…ఏ...ఏ..నా 

8, ఫిబ్రవరి 2017, బుధవారం

Swetambara dharini శ్వేతాంబర ధారిణి

శ్వేతాంబర ధారిణి
రచన : డా. పి యల్ యన్ ప్రసాదుగారు
సంగీతం,  గానం : యం.యశోధరగారు
మోహనరాగం, ఏకతాళం


పల్లవి:
శ్వేతాంబర ధారిణి శ్వేతాంబర ధారిణి
శ్వేతహాసిని శ్వేత మరాళ విరసితా శ్వేత వరప్రదా
శ్వేతాంబర ధారిణి……..


చరణం :
సత్యస్వరూపమే భాసింపగా వేదజ్ఞానమే వాక్కున నిలుపుమా
స్వరరాగ సంచారముతో స్వరరాగ సంచారముతో
శృతి శుభ తత్వం మీయవే
ఇంద్రియ నిగ్రహము ఒసగు ఐంకార రూపిణి
విరించి వలపుల రాణి విరించి వలపుల రాణి
వసగామృతము మియ్యవే వాగ్దేవి…..
……….శ్వేతాంబర ధారిణి……….


శాస్త్ర జ్ణానమును సకల కళలను రసికులు మెచ్చగా రాగశోభలతో
ముచ్చటములకు మోదము కూర్చగా
ఓంకారమునే నా వాక్కున నిలుపుమా
శ్వేతాంబర ధారిణి శ్వేతాంబర ధారిణి
శ్వేతహాసిని శ్వేత మరాళ విరసితా శ్వేత వరప్రదా
……..శ్వేతాంబర ధారిణి……

Enta madhuramo ఎంత మధురమో

ఎంత మధురమో
కానడ రాగం,  ఆది తాళం
గానం : సుధాగారు


పల్లవి :
ఎంత మధురమో శ్రీసాయి నామము
ఇంత వరకు ఎరుగమైతిమి ఇంత మధురమని
……...ఎంత మధురమో …..


చరణం :
ఎంత పాడుకున్నను సమయమే తెలియదు
ఎంత గ్రోలుకున్నను తనివే తీరదు
సాయి అనినంత తనువు ఊగిపోతున్నది
సాయి అనినంత మనసు నాట్యమాడుతున్నది
……..ఎంత మధురమో…..


విలువ కట్టి చెప్పుటకు వీలుకాని రత్నమిది
ఏ జన్మ పుణ్యమో మనకు లభ్యమయినది
ఇల దాస కోటిలో ప్రతిధ్వనించు నామము
కలనైన మరువలేని కమనీయ నామము


ఎంత మధురమో శ్రీసాయి నామము
ఇంత వరకు ఎరుగమైతిమి ఇంత మధురమని
……...ఎంత మధురమో …..

Vidhyullilika lallina విద్యులల్లిక లల్లిన

గణతంత్ర మహోత్సవము సాంగ్
విద్యులల్లిక లల్లిన
గానం : మోచర్ల సుధావల్లిగారు


విద్యులల్లిక లల్లిన పల్లెల వాకిళ్ళు
వింత జతుల వెల్లి విరియ చల్లని ముంగిళ్ళు….2
వెన్నులపై తిన్నుమీరు విశృత నాట్యాలు
కలువల పందిర్లు వేసే చిలుకల లాస్యాలు
ఆనందం వెల్లి విరిసే ఎల్లెడలా నేడు
గణతంత్ర మహోత్సవ శుభ దివసం మీనాడు


ఒప్పులగుప్పల లాడే వయ్యారంబు  భామలు
కర్పూరపు హారతి గొని వచ్చిరి వేమలు
భారత భువి దివియై ఇక వర్ధిల్లు వసంతం
బాపు తన హర్షాక్షత యెల్లన జల్లేరు
ఆనందం వెల్లి విరిసే ఎల్లెడలా నేడు
గణతంత్ర మహోత్సవ శుభ దివసం మీనాడు


కన్నీరే పన్నీరై వర్షించెను నేడు
ఎన్నో కష్టాల ఫలము ఇల చేరనదీనాడు
ఆనందం వెల్లి విరిసే ఎల్లెడలా నేడు -ఎల్లెడలా నేడు …...

Daya chudumaya దయ చూడుమయా

దయ చూడుమయా
గానం :  మోచర్ల సుధావల్లిగారు


పల్లవి :
దయ చూడుమయా తిరుమల నిలయా..2
భక్తుల మొర విని పాలించుమయా
……..దయచూడుమయా……


చరణం :
ఏతావు నుండైనా నీ కొండ చేరేము
ముడుపులు తెచ్చెము కన్నతండ్రి నీకు
అజ్ఞానులము మా అపరాధముల సైచి
ఆదుకోవేమయ్య ఏడుకొండలవాడ
…..దయచూడుమయా…..


పిలిచిన పలికే దైవము నీవని
కలియుగమందున ఘనత కాంచితివి
చల్లని స్వామి శ్రీవెంకటేశ
మొరవినమేమయ్య ఓ శ్రీనివాస
…...దయచూడుమయా…..


ఇల వైకుంఠము తిరుపతి కొండ
నిత్యకళ్యాణముగా నిలయము నీకొండ
ఆ కొండపై నీవు అలివేలు మంగతో
ఆనందమున తేలి నను మరచినావా


దయ చూడుమయా తిరుమల నిలయా
భక్తుల మొరలను విని పాలించుమయా

దయ చూడుమయా తిరుమల నిలయా…..

Brahamda nayaka బ్రహ్ర్మాండ నాయక

బ్రహ్ర్మాండ నాయక
సిందుభైరవి ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

Audio
పల్లవి :
బ్రహ్ర్మాండ నాయక షిరిడి దేవా అఖిలాండమంతా నీవే గావా
షిరిడి వాసా నీవే గావా
బ్రహ్ర్మాండ నాయక….ఆ.. ఆ….
ఆ….ఆ...ఆ…...


చరణం :
పావనము మధుర భావనము నీ చరితం
ధ్యానముగా సేయ గానము ప్రతి దినము
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి...4
…….బ్రహ్ర్మాండ నాయక…….


నీ చరణం శ్రీ గురు చరణం
సాయి చరణం తాకిన తరుణం
కలుగును జ్ఞానం తొలగును పాపం
సాయి శరణం పాప హరణం
సాయి శరణం శ్రీ  బాబా శరణం


బ్రహ్ర్మాండ నాయక షిరిడి దేవా అఖిలాండమంతా నీవే గావా
షిరిడి వాసా నీవే గావా
షిరిడి వాసా నీవే గావా
బ్రహ్ర్మాండ నాయక….ఆ.. ఆ….

ఆ….ఆ...ఆ…...

Anuvanuvuna hari nadam అణువణువునా హరినాదాం గోదాదేవి పాశురం-07

గోదాదేవి పాశురం-07
రచన : పి.యల్.యన్. ప్రసాదుగారు
సంగీతం,  గానం : యం. యశోధరగారు
భూపాలరాగం


అణువణువునా హరినాదం అలరించెను చూడమని
పల్లెయే పలవరించే మేలుకొని వినుము సఖి
….అణువణువునా హరినాదం…..ఆ...ఆ...ఆ…..ఆ...ఆ…..


రేయంతా రెచ్చినా పోరులే సలిపినా
కొక్కొరోకోయని తొలిపొద్దు లేచెనె కోళ్ళు
ఆలమందల అరుపులు పాలకావిళ్ళ చప్పుళ్ళు
నిలువు కడవళ్ళ చిలుకుళ్ళు అవిగో నీరజాక్షుని కళ్ళు
అవిగో నీరజాక్షుని కళ్ళు……
…..అణువణువునా……….


గాజులు గలగల లాడెనే అతివల అందెల మ్రోగెనే
కిలకిల నవ్వుల రాగాలు కృష్ణుని కొంటె సరాగాలు
వినివేగా లేచి రావే వినివేగా లేచి రావే మేలుకొనవే మానినీ మేలుకొనవే మానినీ

…..అణువణువునా……..

Kovela pilichenu కోవెల పిలిచెను గోదాదేవి పాశురం-6

గోదాదేవి పాశురం-6
రచన : డా. పి యల్. యనత. ప్రసాద్ గారు
సంగీతం : యం . యశోధరగారు
అరభి రాగం


కోవెల పిలిచెను కోమలి కనవే
ప్రకృతి పలికెను పడతి వినవే…...వినవే


గణ గణ లాడెను కోవెల మ్రోగె ఘంటానాదం
అలుపెరుగక మ్రోగే హరి నిలయ శంఖారావం
భక్తుల మొరలవి వినవచ్చే అర్తనాదం
లోకుల కాకుల కేకలు వినలేవా
మత్తుని వదిలి వినవే చెలియా
…..కోవెల పిలిచెను….


పాలిచ్చి చంపెడి పూతన ప్రాణాలు పీల్చెనే
బండి రాక్షసుని చూచి వామ పాదాన తన్నెనే
ఆ యోగ నిద్ర చూడవే నీ మాయ నిద్ర మానవే
లోకాలకిదె  సౌభాగ్యం కన్నెలకిదే కళ్యాణ కారకం.
.కోవెల పిలిచెను కోమలి కనవే

ప్రకృతి పలికెను పడతి వినవే…...వినవే