31, జులై 2017, సోమవారం

Kanti sukravaramu కంటి శుక్రవారము


Kanti sukravaramu
కంటి శుక్రవారము
ఆనందభైరవి రాగం ఆది/ఏక తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
అన్నమయ్య సంకీర్తన
Audio
పల్లవి :
కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని
కంటి….‌

చరణం :
సొమ్ములన్ని కడబెట్టి సొంపూతో గోణాము గట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి
తుమ్మెద మైఛాయతోన నెమ్మది నుండె స్వామిని
కంటి….

పచ్చకప్పూరమే నూరి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగా దిగనలది
అచ్చెర పడి చూడ అందరి కన్నుల కింపై
నిచ్చ మల్లె పూవు వలె నిటు తానుండె స్వామిని
కంటి….

తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు
పట్టి కరిగించి వెండి పళ్యాల నించి
దట్టముగా మేను నిండా పట్టించి దిద్ది బిట్టు వేడుక
మురియు చుండె బిత్తరి స్వామిని
కంటి…….

29, జులై 2017, శనివారం

Aadya Sri maha lakshmi ఆద్యాశ్రీ మహాలక్ష్మీ

Audio
ఆద్య శ్రీ మహాలక్ష్మీ
రచన,  సంగీతం : దేవుల పల్లి శ్రీదేవి
అమృత వర్షిణి రాగం, ఏక తాళం

పల్లవి :
ఆద్య శ్రీ మహాలక్ష్మీ కదంబ వనవాసిని….
వ్యూహాలక్ష్మీ అందుకో పుష్యరాగ హారతి….

అను పల్లవి :
ఆదిలక్ష్మీ కళ్యాణి అందుకో ..కెంపుల హారతి…..
జ్ఞాన జ్యోతి వెలిగించే విద్యాలక్ష్మికి పచ్చల హారతి….ఆద్య శ్రీ….

చరణం :
ఆపన్నివారిణి ( ఆపన్ నివారిణి ) ఆటంక హారిణి ధైర్యలక్ష్మి నీకిదే వైఢూర్య హారతి
సత్ సంతాన మోసగే సంతాన లక్ష్మికి ముత్యాల హారతి….ఆద్య శ్రీ….

లోకాల పోషించే శక్తి సంధాయిని ధాన్యలక్ష్మి నీకిదే గోమేధిక హారతి
గ్రహదోష నివా.రిణి గజలక్ష్మికి వజ్రాల హారతి….ఆద్య శ్రీ…


కమలాలయే ...సకల సౌ.భాగ్యదే ధనలక్ష్మీ నీకిదే పగడాల హారతమి
సంపత్ ప్రకాశిని విజయలక్ష్మిికి నీలాల హారతి
సకలార్ధదాయని అష్టలక్ష్మికి నవరత్నహారతి


ఆద్య శ్రీ మహాలక్ష్మీ కదంబ వనవాసిని
వ్యూహాలక్ష్మీ అందుకో నవరత్న హారతి…
నవరత్న హారతి……




AADYA SRI MAHALAKSHMI

RACHANA , SANGEETAM: DEVULAPALLI SRIDEVI
AMRUTHAVARSHINI RAGAM,  ADI TALAM

PALLAVI :

AADYA SRI MAHALAKSHMI KADAMBHA VANA VASINI
VYUHA LAKSHMI ANDUKO PUSHYARAGA HARATI

ANUPALLAVI :
ADI LAKSHMI KALYANI ANDUKO KEMPULA HARATI
GNANA  JYOTHI VELIGINCHE VIDHYA LAKSHMI PACHALA HARATI. ….AADYA SRI MAHALAKSHMI……..

CHARANAM :
AAPAN NIVARINI ATANKA HARINI
DHAIRYA LAKSHMI NEEKEDE VYDURYA HAARATI
SAT SANTANA MOSAGE SANTANA LAKSHMI KI MUTYALA HAARATHI…..ADYA SRI…

LOKALA POSHINCHE SAKTI SANDHAYANI DHANYA LAKSHMI NEEKEDE GOMEDHIKA HAARATI
GRAHA DOSHA NEVARINI GAJA LAKSHMI KI VAJRALA HAARATI….AADYA SRI….

KAMALAALAYE SAKALA SOWBHAGYADE DHANA LAKSHMI NEEKEDE PAGADALA HAARATHI
SAMPAT PRAKASHINI VIJAYA LAKSHMI KI NEELAALA HARATI.
SAKALARDHA DAYANI ASHTA LAKSHMI KI NAVARATNA HARATI

AADYA SRI MAHALAKSHMI KADAMBHA VANA VASINI
VYUHA LAKSHMI ANDUKO NAVARATNA  HAARATI
NAVARATNA  HAARATI…….

21, జులై 2017, శుక్రవారం

SRI GAJA LAKSHMIM CHINTAYAMYAHAM శ్రీ గజలక్ష్మీం చింతయామ్యహం

SRI GAJA LAKSHMIM CHINTAYAMYAHAM
శ్రీ గజలక్ష్మీం చింతయామ్యహం
మళయమారుతరాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
AUDIO
పల్లవి :
శ్రీ గజలక్ష్మీం చింతయామ్యహం
వాగీశార్చిత భవ్య పాదుకాం
శ్రీ గజలక్ష్మీం చింతయామ్యహం

చరణం :
పద్మాకరాం పద్మాసన సంస్థాం పద్మనాభహృద్ పద్మ మందిరాం
పద్మ ముఖిం పద్మాం సురేశ్వరీం
పద్మినీం మహా.. పద్మ వనకృతాం
….శ్రీ గజలక్ష్మీం చింతయామ్యహం...

గృహకృత సంపద కీర్తి వర్ధినీం గృహలక్ష్మీం సద్ గృహ సంవాసం అనుపమ చరితాం నిరుపమ సుఖదాం గ్రహదోషహరాం అనుగ్రహకరాం

శ్రీ గజలక్ష్మీం చింతయామ్యహం
వాగీశార్చిత భవ్య పాదుకాం

శ్రీ గజలక్ష్మీం చింతయామ్యహం

Sri kanaka valliki శ్రీకనకవల్లికి సిరుల మా తల్లికి

Sri kanaka valliki
శ్రీకనకవల్లికి సిరుల మా తల్లికి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
audio
శ్రీకనకవల్లికి సిరుల మా తల్లికిి సౌభాగ్యవతికిదే జయమంగళం
చక్కని మోమునకు శ్రీకాంత శోభితకు శ్రీమహాలక్ష్మికి శుభమంగళం


ఘల్లు ఘల్లున గజ్జె లందెలు మ్రోగేటి పాదపద్మములకు ఇదే మంగళం
కనకధారలతోడ గాజుల సవ్వడితో హస్త కమలంబులకు ఇదే మంగళం


కరుణా కటాక్ష వీక్షణంతో చూసేటి అరవిందలోచనకు జయమంగళం
సకల శుభ కళలతో అలరాలుచున్న మా పద్మనాభ ప్రియకు ఇదె మంగళం


అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకియగు జయ జగజ్జననికిదె మంగళం
కోరినదే తడవుగా వరములిచ్చే తల్లి హరి పట్టపురాణికిదె మంగళం



20, జులై 2017, గురువారం

Enta chakkani danavamma ఎంత చక్కని దానవమ్మా

Enta chakkanidanavamma
ఎంతచక్కని దానవమ్మ
శ్రావణ వరలక్ష్మీ పాట
శ్రీరాగం / ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :

ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మీ
మంగళహారతి గైకొనవమ్మ శ్రావణవరలక్ష్మీ

చరణం :
ఎపుడూ అడుగుట యేనా తల్లి
మా ఇంటికి ఒక పరి రావమ్మ
పసుపు కుంకుమలు పూలగాజుల
వాయనమిచ్చి కొలిచేనమ్మ

రీస రీస రిమరీసరి
రిమ పామ పామ పనిపమప
పని సాని సాని సరిసనిసా
గరిసా నీ పా దని పామా రిగరిస ఎంత చక్కని దానవమ్మా…….

కరుణించి సుఫలమ్మునొసంగు
సద్వినియోగం చేసేమమ్మా
నిత్య సుమంగళిగా దీవించు
నిరతము నిను సేవించేమమ్మా

రీస రీస రిమరీసరి
రిమ పామ పామ పనిపమప
పని సాని సాని సరిసనిసా
గరిసా నీ పా దని పామా రిగరిస ఎంత చక్కని దానవమ్మా…….

Lakshmi rave ma intiki లక్ష్మీరావే మాఇంటికి

Lakshmi rave ma intiki
లక్ష్మీ రావే మా ఇంటికి
మాయ మాళవ గౌళ రాగం , ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
లక్ష్మీ రావే మాఇంటికి
క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి

చరణం :
పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము
పంచ బిల్వములు పూర్ణ కలశము
శ్రావణమాసపు శుక్రవారం రంగు రంగుల
రంగవల్లుల ముంగిట మాతా పూజను గొనుమా

అందముగా జరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక
మొగిలి పువ్వుల జడనే అల్లి జడకుచ్చులను పెట్టెమమ్మా జలజ లోచనికి ముదముతోను

గుండె మల్లె మొగలిపూలు దండిగా చామంతిపూలు
మెండైన పారిజాతాలు చల్లని గంధము సాంబ్రాణి ధూపము లివిగో చంద్రుని సోదరికి

కదళీ ఫలము నారికేళము మేలైన దానిమ్మ పండ్లు
ఘనముగా కర్జుర పండ్లు పంచభక్ష్యాది పరమాన్నములు నైవేద్యముగా గైకొనవమ్మా

పచ్చని తోరము చేతికి కట్టి చారుమతి కథ ఆలకించి
ముత్తైదువుకే వాయనమిచ్చి సౌభాగ్యములు సంతోషములు నీకృపతోనే పొందెదమమ్మా

లక్ష్మీ రావే మాఇంటికి
క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి
లక్ష్మీ రావే మాఇంటికి ...‌రావే మా ఇంటికి‌...రావే మా ఇంటికి.‌..

19, జులై 2017, బుధవారం

Lakshmi me padamu లక్ష్మి నీ పాదము

Lakshmi ne padamu
లక్ష్మీ నీ పాదము
మోహనరాగం , ఖండచాపు తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
లక్ష్మీనీ పాదము కాచి ఉన్నామమ్మా
కరుణాతో బ్రోవరావే ...
సన్నుతమతి నీవే వైభవంబులు నీవే
కల్లా కాదే నిజము హారతి గైకొనుము
లక్ష్మీనీ పాదము కాచి ఉన్నామమ్మా

చరణం :
చిన్నతనము నుండి చేసిన పాపములు ఎన్నెన్నో కలవు తల్లి
అన్ని పారద్రోలి కన్నతల్లిగా జూచి
కరుణింపవే మమ్ము హారతి గైకొనుము
లక్ష్మీనీ పాదము కాచి ఉన్నామమ్మా

మా మీద దయ ఉంచి నయముతో
వరరాశి ప్రేమతో మాకీయవే
క్షీరాబ్ధి కన్యవు శ్రీమహాలక్ష్మివి
స్ధిరముగా కాచుము హారతి గైకొనుము

లక్ష్మీనీ పాదము కాచి ఉన్నామమ్మా
కరుణాతో బ్రోవరావే ...హారతి గై కొనవే
హారతి గైకొనవే...

Indivarakshiki ఇందివరాక్షికి

Audio
ఇందివరాక్షికి indivarashiki
ఆనందభైరవిరాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

పల్లవి :
ఇందివరాక్షికి కుందరదనకును
బంధుర వదనకు మంగళం
చందురు సోదరి అయిన శ్రీలక్ష్మికి జలనిధి కన్యకు మంగళం

చరణం :
పరమపావనికి పద్మాలయకును
మరు జననికి జయ మంగళం
కరిరాజగమనకు కాంతాలలామకు
కంబు కందరికిని మంగళం

నీరజపాణికి నిఖిలేశ్వరికిని
నిగమ సన్నుతకునూ మంగళం
వారణ సేలమునకు వేంచేసిన
వరదుని రాణికి మంగళం

ఇందివరాక్షికి కుందరదనకును
బంధుర వదనకు మంగళం
బంధుర వదనకు మంగళం
శ్రీజయలక్ష్మికి మంగళం
సౌభాగ్యలక్ష్మికి మంగళం….

Bhagyala lakshmi భాగ్యాల లక్ష్మీ

Bbhagyala lakshmi
భాగ్యాలా లక్ష్మి
శ్రీరాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
భాగ్యాల లక్ష్మీ రావమ్మా…..
భాగ్యాల లక్ష్మీ రావమ్మా
మాయమ్మా శ్రీ సౌభాగ్యాల లక్ష్మీ రావమ్మా
మాయమ్మా శ్రీ సౌభాగ్యాల లక్ష్మీ రావమ్మా

చరణం :
నుదుట కుంకుమ రవి బింబముగా
కన్నుల నిండుగా కాటుక మెరయ
కాంచన హారము గళమున మెరయ
పీతాంబరములు శోభతో నిండుగా
...భాగ్యల లక్ష్మీ రావమ్మా….

నిండుగ కరముల బంగరు గాజులు
ముద్దులొలుకు పాదంబుల మువ్వలు
ఘల్లు ఘల్లుమని సవ్వడి సేయగా
సౌభాగ్యవతుల సేవల నొందగ
…..భాగ్యాల లక్ష్మీ రావమ్మా….

భాగ్యములిచ్చు బంగరు తల్లి
పురంధర విఠలుని పట్టపు రాణి
శుక్రవారము పూజల నొందగా
సాయంకాలపు  శుభఘడియలలో
శుక్రవారము పూజల నొందగా
శ్రావణమాసపు శుభఘడియలలో

భాగ్యాల లక్ష్మీ రావమ్మా
మాయమ్మా శ్రీ సౌభాగ్యాల లక్ష్మీ రావమ్మా
వరలక్ష్మి రావమ్మా……
శ్రీలక్ష్మీ రావమ్మా….
జయలక్ష్మీ రావమ్మా...

Etla ninnethu kondunamma ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా



Etla ninnetu kondunamma
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
శ్రీరాగం ,ఆదితాళం
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చేవమ్మా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా

చరణం :
పసి బాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి
పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన కలహంస నడకలతో రావమ్మా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందుమ్మా

వేయి నామాల కల్పవల్లి వేయి మారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి
సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కల్గి
ఆయుర్ వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చె తల్లి
ఆయుర్ వృద్ది అష్టైశ్వర్యము ఐదవతనములిచ్చే తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా

నవరత్నాలు నీ నగుమోమే తల్లి వరలక్ష్మీ కనకరాశులు కళ్యాణి
కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మి
శ్రావణపూర్ణిమ/పౌర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా 

15, జులై 2017, శనివారం

Srilakshmi Varalakshmi శ్రీలక్ష్మీ వరలక్ష్మీ

శ్రీలక్ష్మి వరలక్ష్మి
Srilakshmi varalakshmi
కళ్యాణి రాగం ,  ఖండ చాపు తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
శ్రీలక్ష్మీ వరలక్ష్మి శృంగారలక్ష్మి
మాలక్ష్మి రావమ్మ మమ్మేలు మమ్మా

అను పల్లవి :
గజ్జెలందెల కాళ్ళు ఘల్లు ఘల్లని మ్రోయ
కళ్యాణదేవిరో కదలి రావమ్మ
…….శ్రీలక్ష్మి వరలక్ష్మి……

చరణం :
పసిడి కంకణ రవళి దిశెలెల్ల మెరయగా
భాగ్యదేవతవేగా పాలింపుమమ్మా
ముక్కోటి దేవతలు ముదముతో కొలువగా
మావీధి కేతెంచి మమ్మేలుమమ్మా
…..శ్రీలక్ష్మి వరలక్ష్మి…...

7, జులై 2017, శుక్రవారం

Vandanam satavandanam వందనం శతవందనం

Vandanam satavandanam
వందనం శతవందనం
మిశ్రగతి తాళం , కానడరాగం
సాయిబాబా పాట
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీ గారు
Audio
పల్లవి :
వందనం శతవందనం శుభవందనం శ్రీసాయినాధా….
వందనం శతవందనం శుభవందనం శ్రీసాయినాధా
వందనం పదవందనం జయవందనం శ్రీ సద్గురుం
వందనం శతవందనం శుభవందనం శ్రీసాయినాధా

అనుపల్లవి :
వందనం బృందావనం తులసీవనం నీ మందిరం
పరిమళం మధురామృతం ప్రియ సుమసితం శ్రీ సద్గురుం
వందనం శతవందనం శుభవందనం శ్రీసాయినాధా….

చరణం :
ఆనందసాగర సన్నిధిం అత్యంత చల్లని చందనం
భవసాగరం భవభయహరం పరమైఖ్య సాధన కీర్తనం
నామానసం నాజీవితం నాసర్వము నీకర్పితం
నీభావనం నీపూజనం నీసేవనం నీకర్పితం
వందనం శతవందనం శుభవందనం శ్రీసాయినాధా….


సాయి కీర్తన వందనం శ్రీసాయి ప్రేరణ భావనం
భక్త హృదయ స్పందనం ఘనభక్తి లిఖిత ప్రభాసితం
అర్పితం సంకల్పితం భవయోగినం శ్రీసద్గురుం
సాయి కీర్తన మానసం ఈ భక్త సేవిత నీరజం

వందనం శతవందనం శుభవందనం శ్రీసాయినాధా
వందనం పదవందనం జయవందనం శ్రీ సద్గురుం
వందనం శతవందనం శుభవందనం శ్రీసాయినాధా...
శ్రీసాయినాధా…..
శ్రీసాయినాధా……..‌

3, జులై 2017, సోమవారం

Saranagata rakshana శరణాగత రక్షణ

Saranagata rakshana
శరణాగత రక్షణ
యమన్ కళ్యాణీ రాగం, ఏకతాళం
సంగీతం : నేదునూరి క్రిష్ణమూర్తి గారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
రామదాసు కీర్తన

పల్లవి:Audio
ఆ.ఆ.ఆ.ఆ.
శరణాగత రక్షణ బిరుదని నే శరణంటి గదయ్యా
వెరవకుమని అభయం వొసగవే నన్ను కన్న తండ్రివయ్యా ...ఆ..ఆ..

చరణం :
కరివరదా సిరు లొసగను దశరధ నందన రావయ్యా…
నిరతము నీ నామము నా జిహ్వకు రుచిగొనవయ్యా ఆ..ఆ..ఆ..ఆ..

ఆదిదేవ నీ చిత్తము భాగ్యము భావమెవరిదయ్యా
నీ దాసులకును నే దాసుడా దయయుంచి యేలుమయ్యా ….

ముద్దులొలుక రామదాసుడని ముచ్చటలాడుమయా
భక్తుల నీడేర్చడి వరభద్రాచలపతి నీవేనయ్యా ఆ..ఆ...ఆ...ఆ...

2, జులై 2017, ఆదివారం

Madi swatantra desam మాది స్వతంత్ర దేశం

Madi swatantra desam
మాది స్వతంత్ర దేశం
ఆ..ఆ..ఆ..   ఆ..ఆ..ఆ..  ఆ..ఆ..ఆ..
మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి
మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి
భరతదేశమే మాదేశం భారతీయులం మా ప్రజలం
భరతదేశమే మాదేశం భారతీయులం మా ప్రజలం
మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి
ఆ..ఆ..ఆ.. ఆ..  ఆ.. ఆ..ఆ..

వింధ్య హిమవత్ శ్రీనీలాదుల సంధ్యా రుధిత నవాజులు మావి మావి మావి మావి
గంగా గోదావరి సహ్యదా తుంగ తరంగిట హృదయాలు మావి మావి మావి మావి
ఆలయంబుల శిల్ప విలాసం ..2
ఆరామంబుల కళా ప్రకాశం
ఆలయంబుల శిల్ప విలాసం
ఆరామంబుల కళా ప్రకాశం

మొఘల్ సమాధుల రస ధరహాసం మాకు నిత్యము భలే ఇతిహాసం
అహింసా పరమో ధర్మః సత్యం వధ ధర్మం చర..2
ఆదిఋషుల వేదవాక్కులు
మాగాంధి గౌతముల సుభాహులు
స్వతంత్రత భాతృత్వాలు సమతా మా సదాశయాలు..2
జనని ఓ స్వతంత్ర దేవి కనుమా నివాణులు మావి
మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి
మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి
భరతదేశమే మాదేశం భారతీయులం మా ప్రజలం
భరతదేశమే మాదేశం భారతీయులం మా ప్రజలం
మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి
ఆ..ఆ..ఆ..    ఆ..ఆ..ఆ..

Garuda gamana tava గరుడ గమన తవ

Garuda ganana tava
గరుడ గమన తవ
Audio
గరుడ గమన తవ
చరణ కమల మిహ
మనసిల సతు మమ నిత్యం
మమ తాపమ పాకురు దేవ
మమ పాపమ పాకురు దేవ

జలజ నయన విధి
నముచి హరణ ముఖ
విభుధ వినుత పద పద్మ
మమ తాపమ పాకురు దేవ
మమ పాపమ పాకురు దేవ

భుజగ శయన భవ
మదన జనక మమ
జనన మరణ భయ హారి
మమతాపమ పాకురు దేవ
మమ పాపమ పాకురు దేవ

శంఖ చక్రధర
దుష్ట దైత్య హర
సర్వలోక శరణా
మమ తాపమ పాకురు దేవ
మమ పాపమ పాకురు దేవ

అగణిత గుణగణ
అశరణ శరణద
విదలిత సురరిపు జాలా
మమ తాపమ పాకురు దేవ
మమ పాపమ పాకురు దేవ

భక్తవర్య మిహ
భూరి కరుణయా
పాహి భారతి తీర్ధం
మమ తాపమ పాకురు దేవ
మమ పాపమ పాకురు దేవ

గరుడ గమన తవ
చరణ కమల మిహ
మనసిల సతు మమ నిత్యం
మమ తాపమ పాకురు దేవ
మమ పాపమ పాకురు దేవ