30, మే 2018, బుధవారం

Ranganatha sriranganatha రంగనాధా

రంగనాధా శ్రీరంగనాధా
గానం:శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
రంగనాధా శ్రీరంగనాధా
లక్ష్మీ హృదయాంతరంగనాధా

దోసములెంచకు రంగనాధా
దోసిలొగ్గితిని శ్రీరంగనాధా
కరుణించి బ్రోవుమయా కావేటిరంగా
సిరిగల దేవడవు కరుణాంతరంగా
….రంగనాధా...

హృదయ తాపముల తొలగించు రంగా
పదసరోజముల పూజింతురంగా
అరమోడ్పు కన్నులతో కరుణించరాదా
మొరవినరాదా పాలించరాదా
….రంగనాధా….

ముత్యాల కవచముతో మురిసేటి స్వామి
మురిపాల ఉయ్యాల లూగేటి స్వామి
శ్రీదేవి భూదేవి సేవలందుచు
భక్తుల మాటే మరువకుమయ్యా
...రంగనాధా….

Madhura madura smita మధుర మధుర స్మిత

మధుర మధుర స్మిత
సింధు భైరవి రాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు


వేంకటరమణ సంకటహరణ కావగ రావా కల్మష హరణ
వేంకటరమణ సంకటహరణ
కావగ రావా కల్మషహరణ

మధుర మధుర స్మిత సుందర వదనా
మధుర మనోహర వేంకట రమణ
వేంకటరమణ సంకటహరణ
కావగ రావా కల్మషహరణ
మధుర మధుర స్మిత సుందరవదనా….

సప్త గిరీశ భక్త హృదయేశా
భవ భయనాశా హే జగదీశా
వేంకటరమణ సంకటహరణ
కావగరావా కల్మషహరణ
మధుర మధుర స్మిత సుందరవదనా
మధుర మనోహర వేంకటరమణ

తవపద చరణం కలిదోష హరణం
తవనామ స్మరణం కష్ట నివారణం
తవ పద సేవనం ఇహపర సాధనం
తవదివ్య దాస్యం జన్మ సార్ధకం

వేంకటరమణ సంకటహరణ
కావగరావా రారాకల్మషహరణ
మధుర మధుర స్మిత సుందర వదనా
మధుర మనోహర వేంకట రమణ వేంకటరమణ సంకణహరణ కావగా రారాకల్మషహరణ

29, మే 2018, మంగళవారం

Phala netranala ఫాలేత్రానల

ఫాలనేత్రానల
శ్రీరాగం, తాళం ..ఖండగతి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio

పల్లవి:
ఫాలనేత్రానల ప్రభల విద్యుల్లతా
కేళీ విహార లక్ష్మీనారసింహా
కేళీ విహార లక్ష్మీనారసింహా

చరణం :
ప్రళయ మారుత ఘోర భస్త్రీకా పూత్కార
లలిత నిశ్వాస డోలా రచనయా…
కుల శైల కుంభినీ కుముదహిత
రవి గగన
చలన విధి నిపుణ నిశ్చల నారసింహా
...ఫాలనేత్రానల…..

వివర ఘన వదన దుర్విధహాసన నిష్ఠ్యూత
లవదివ్య పరుష లాలాఘటనాయా…..
వివిధ జంతువ్రాత భువన మగ్నౌకరణ
నవ నవ ప్రియ గుణార్ణవ నారసింహ
.‌‌‌‌‌‌...‌‌ఫాలనేత్రానల….

దారుణోజ్వల ధగద్జగిత దంష్ట్రాంనల
వికార స్పులింగ సంగ క్రీడయా….
వైరి దానవ ఘోర వంశ భస్మీకరణ
కారణ ప్రకట వేంకట నారసింహా
…...ఫాలనేత్రానల ప్రభల విద్యుల్లతా
కేళీ విహార లక్ష్మీనారసింహా
కేళీ విహార లక్ష్మీనారసింహా
లక్ష్మీనారసింహా...లక్ష్మీనారసింహా…..లక్ష్మీనారసింహా…….‌

గోదావరి హారతి godavari harati

గోదావరి హారతి
కళ్యాణి రాగం,ఏక తాళం ,తిశ్రగతి   
రచన :కాశీభట్ల సత్యన్నారాయణ
సంగీతం :ఆకొండి శ్రీనివాస రాజారావు
Audio
పల్లవి :
శ్రీరాముని పాద్యంబగు మాజీవ భాగ్యంబగు
మాతల్లికి గౌతమికి జయము జయము జయము
అను పల్లవి :
జన జీవన జనయిత్రికి సౌభాగ్యద సీమంతికి
జయము జయము జయము జయము
…..శ్రీరాముని…..

చరణం :
పగటి వెలుగు తళతళలా శశికాంతుల మిలమిలలా
ముట్టుకుంటే అంటుకొనే తడి వెలుగని శృతి పొగడిన
మా తల్లికి జయము జయము జయము
…...శ్రీరాముని……

వనసీమల వరిసీమల నారికేళ ఫలసీమల
తన పిల్లల కరుణించుచు మురిసిపోవు మా తల్లికి
జయము జయము జయము జయము
…..శ్రీరాముని…..

గోక్షీరము తనదు నీరు వరిఅన్నము తనదు రూపు
గౌతమాది మహర్షుల చేతివ్రాత తరంగాల
మాతల్లికి గౌతమికి జయము జయము జయము
…...శ్రీరాముని…..

ఈ పాద్యము మా భాగ్యము ఈ హారతి నీదు కాంతి
అమృతఫల నైవేద్యము మాదు తృప్తి కాదు తల్లి
నీది నీకు నిచ్చు తృప్తి నిరతంబుగా సాగనిమ్ము
మాతల్లికి గౌతమికి జయము జయము జయము
…..శ్రీరాముని…..

ఎంతమంది సంతానమే అంతమంది కడుపునిండ
సాగిపోవు మాతల్లి మాముందే ఉన్నట్లుగా
చూచి చూచి తరియింతుము తెలిసి తెలిసి వర్తింతుము
కోనసీమ పరిపూతకు ఋషి మార్గపు సంశేవ్యకు
మాతల్లి గౌతమికి జయము జయము జయము
…..శ్రీరాముని…..

Gomahalakshmiki basavarajuki గోమహలక్ష్మికి బసవరాజుకి

గోమహలక్ష్మికి బసవరాజుకి
బసవన్నా, గోమాతల పెళ్ళి పాట
మధ్యమావతి రాగం
వేమూరి సరోజనీ శాస్త్రీగారిచే రచించబడి, స్వర రచన చేయబడినదిAudio
పల్లవి:
గోమహాలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి చూపులండీ
చూచిన ముహూర్తమెలాంటిదో, మరి పెళ్ళి కుదెరనండీ, ఆనందమాయెనండీ...2
చరణం:
1. రంకెలు వేసే బసవన్నా, ఓరచూపుల గోలక్ష్మీ...2
పెళ్ళి పెద్దల సందడితో ప్రశాంతముగా వున్నారండీ...2
గోమహలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి కుదెరనండి, ఆనందమాయెనండి.

2. పసుపు కుంకుమలు గంధాక్షతలు  పండ్లు పూలు సిద్దము చేసి..2
బసవన్నకు పట్టు వస్త్రము లిచ్చి, గోమహలక్ష్మీని అలంకరించి...2
పెళ్ళివారెంతో మురిసినారండీ
గోమహలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి కుదెరనండి, ఆనందమాయెనండి.

3. ధర్మమునకు ప్రతిరూపము మాబసవేశ్వరుడండీ...2
డూ..డూ.. బసవన్న కాడండి శివభక్తి పరాయణుడండీ...2
గోమహలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి కుదెరనండి, ఆనందమాయెనండి.

4. గోమహలక్ష్మీ సాక్షాత్తు భుస్వరూపమండీ...2
అందచందాల సహన గుణముతో ప్రకాశించునండి  
గోమహలక్ష్మీ సాక్షాత్తు భుస్వరూపమండీ
అందచందాల సహన గుణముతో ప్రకాశించునండి
అమృత తుల్యమగు క్షీరధారలతో అందరినీ పోషించునండి….2
లోకమును  కాపాడునండి..లోకములను కాపాడునండి
గోమహలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి కుదెరనండి, ఆనందమాయెనండి.

5. బ్రహ్మవేత్తలు వేదమంత్రములు  పఠించినారండీ...2
సిరులొలికే గోలక్ష్మికి ఠీవిగ నిలబడు బసవరాజుకి ….2
పెళ్ళి కుదెరెనండీ ...2

మాంగల్యం తంతునానేనా లోకరక్షణ హేతునా, కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం…సంజీవ శరదాం శతం….

గోమహలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి జరిగెనండి, ఆనందమాయెనండి

6.ఈ కళ్యాణము జరుగుట చూచి దేవతలంతా దీవించేరు...2
అందరి మనస్సులు అనందముతో నిండిపోయెనండీ…..2
జయలక్ష్మీ  శ్రీనివాసుల హృదయాలు ఉప్పోంగెనండీ …..2
హృదయాలు ఉప్పోంగెనండి...2
గోమహలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి జరిగెనండి, ఆనందమాయెనండీ

ఆనందమానందమాయెనే
మాగోలక్ష్మీ పెళ్ళికూతురాయెనే  
ఆనందమానందమాయెనేే
మాబసవన్నా పెళ్ళికొడుకాయనే…2
మాగోలక్ష్మీ పెళ్ళికూతురాయెనే  
మాబసవన్నా పెళ్ళికొడుకాయనే…
😊 😳    😊 😳 😊 😳     😊 😳 😊 😳 😊 😳

23, మే 2018, బుధవారం

Podale nindu kalala పొదలే నిండు కళల

పొదలే నిండు కళల
అనందభైరవి రాగం ,ఆదితాళం
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
జాజర జాజర జాజర జాజర జాజా
జాజర జాజర జాజర జాజర జాజా
పొదలే నిండు కళల పూన్నమ నేడు
జాజర జాజర జాజర జాజర జాజా
అదను తప్పక జాజరాడుదవు రావయ్య

చరణం:
జలజాక్షీ మోమునకు చంద్రోదయ మాయ
నెలకొన్న నవ్వుల వెన్నెల గాసెను వెన్నెల గాసెను
కలికి కన్నుల నల్ల కలువలు వికసించే
అలరి ఈకెతో జాజరాడుదువు రావయ్య
జాజర జాజర జాజర జా జర జాజా

యెనసీ , జవ్వనమున యేతెంచే వసంతకాల
మొనరి మొవి చిగురు లుప్పతిల్లెను చిగురు లుప్పతిల్లెను
గొనకొన్న తురుమున కూడే తుమ్మెద మూక
అనుమానించక జాజరాడుదువు రావయ్య
జాజర జాజర జాజర జా జర జాజా

కుంకుమ చెమట చను కొప్పెరలా నిండుకొనే
కొంకుక గోళ్ళే బుర్రట కొమ్ములాయెను బుర్రట కొమ్ములాయెను
లంకలై శ్రీవేంకటేశ లలనతో కూడితివి
అంకెలనే పొద్దు జాజరాడుదువు రావయ్య

పొదలే నిండు కళల పూన్నమ నేడు
జాజర జాజర జాజర జా జర జాజా
అదను తప్పక జాజరాడుదవు రావయ్య
జాజర జాజర జాజర జా జర జాజా
జాజర జాజర జాజర జా జర జాజా
జాజర జాజర జాజర జా జర జాజా

Pubonula koluve పూబోణుల కొలువే

పూబోణుల కొలువే
ఆదితాళం                       తిల్లాంగరాగం
గానం : శ్రీమతి విద్యాభారతిగారు

పల్లవి :
పూబోణుల కొలువే పుష్పయాగము
పూవొక పూచే నీకిటే పుష్పయాగము
పూబోణుల కొలువే పుష్పయాగము

చరణం :
కలువ రేకుల వంటి ఘనమైన కన్నుల
పొలతుల చూపులే నీ పుష్పయాగము
తలచి తలచి నిన్ను తమ మేనుల పొడమే
పులక జంపములే నీ పుష్పయాగము
...పూబోణుల కొలువే….

కరకమలములను కందువ గోపికలెల్ల
పొరసి నిన్ను చూపుటే పుష్పయాగము
సరసపు మాటలే సారెనాడె తమ నవ్వు
పొరి నీపై జల్లుటే పుష్పయాగము
…..పూబోణుల కొలువే…


గాటపు కొలనీదండ కాంతలు సిగ్గున నిన్ను
బూటకానకు తీట్టుటే పుష్పయాగము
ఈటున శ్రీ వేంకటేశ యిట్టే అలమేల్మంగ
పూట పూట రతులివి పుష్పయాగము.

పూబోణుల కొలువే పుష్పయాగము
పూవొక పూచే నీకిటే పుష్పయాగము
పూబోణుల కొలువే పుష్పయాగము

Pujalandaru chesede పూజలందరూ చేసేదే

పూజలందరు చేసేదే పుష్పయాగము
ఏకతాళం  , హంసరాగం
Audio
పూజలందరు చేసేదే పుష్పయాగము యాజి
నర్జనుడు చేసినదే పుష్పయాగము

మొదల శ్రీ సతి చేతి  మోహన కమలమే
పోదలనీకెపుడునూ పుష్పయాగము
గుదిగొన మిమ్మిద్దరిని గూడించే మరువిరులు పొదిగి పూజించిన పుష్పయాగము
పొదిగి పూజించిన పుష్పయా...గము
…...పూజలందరు…...
మాలాకారుండిచ్చిన మధురలో పూదండ
పోలింప నీకు నదే పుష్పయాగము
కేలితో నారదుడు వొసగిన పారిజాతము
భులోకమున నీకు పుష్పయాగము
భులోకమున నీకు పుష్పయా...గము
…..పూజలందరు…...
తొరలి అలమేల్మంగ తురుమున విరులే నీకు
పొరసి నీ ఉరముపై పుష్పయాగము
సిరులతో మునులెల్ల శ్రీవేంకటాద్రీశ
పొరిపొరి జేసేరు నీకు పుష్పయాగము.పొరిపొరి జేసేరు నీకు పుష్పయా..గము.
పూజలందరు చేసేదే పుష్పయాగము యాజి నర్జునుడు చేసినదే పుష్పయాగము
పూజలందరు చేసేదే పుష్పయాగము..

Pidikita talambrala పిడికిట తలంబ్రాల

పిడికిట తలంబ్రాలు
గానం:శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు….పిడికిట….

చరణం :
పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద
పేరుల మ్యుత్యాల మెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు
పేరు కుచతచ సిగ్గుపడి పెండ్లి కూతురు
…….పిడికిట……


బిరుదు పెండెము వెట్టె పెండ్లి కూతురు నెర
బిరుదు మగని కంటె పెండ్లి కూతురు
పిరుదూరినపుడె పెండ్లి కూతురు పతి
పెరరేచీ నిదివో పెండ్లి కూతురు
…...పిడికిట…….


పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే
పెట్టెడు చీరలు గట్టె పెండ్లి కూతుర
గట్టిగా వేంకటపతి కౌగిటను వడి
వెట్టిన నిధానమైమ పెండ్లి కూతురు.
…….పిడికిట…...

Tiruveedhula తిరువీధుల

తిరు వీధుల
ఏకతాళము, శ్రీరాగము
గానం :శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
తిరు వీధుల మెరసి దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను

చరణం :
తిరు దండెలపై నేగి దేవుడిదే తొలినాడు
సిరుల రెండవనాడు శేషునిమీద
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి కింద
పొరి నాలుగో నాడు పూవు కోవిల లోన
…...తిరు వీధుల మెరసి దేవ దేవుడు……

గ్రక్కున ఐదవనాడు గరుడిని మీద
ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద
చొక్కమై ఏడవనాడు సూర్యా ప్రభలోనను
ఇక్కువ తేరును గుర్ర మేనిమిదో నాడు
….తిరు వీధుల మెరసి దేవదేవుడు…..

కనకపు టందలము  కదిసి తొమ్మిదో నాడు
పెనచి పదోనాడు  పెండ్లి పీట
ఎనసి శ్రీవేంకటేశు డింతి అలమేల్ మంగతో
వనితల నడుమను వాహనాల మీదను

తిరువీధిల మెరసి దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను
తిరువీధిల మెరసి దేవదేవుడు
దేవదేవుడు….దేవదేవుడు…..

Tirumalaiya vindu manchide తిరుమలయ్యవిందు మంచిదే

Audio
తిరుమలయ్య విందు మంచిదే
గానం: విద్యాభారతిగారు

తిరుమలయ్య విందు మంచిదే ఉండంటే ఉంటినమ్మా
సరవి లేని చెంచు వారి సంత యేలే తనకును….

పరికిదండ పొగడదండ బండి గురి గింజ దండ
బెరకు లేని పికిలిదండ బలిదండలన్నియు మెరసి కానుకివ్వపోతే మేనిదండ లడిగేనమ్మ
మరలా చెంచు వారి తోడి మాటలేలే తనకును…..తిరుమలయ్య…...

ముసురుతేనే జుంటితేనే ముదిరినట్టి పెరలతేనే
పొసగమించు పువ్వుతేనే పుట్టతేనెలన్నియును
ఒసగి కానుకియ్యబోతే మోవి తేనెలడెెగెనమ్మా
యెసల చెంచు వారి యెంగిలేటికమ్మ తనకును….తిరుమలయ్య….

వెలగపండు జీడిపండు వెలలేని మోవిపండు
బలుపు దొండ పండు పాలపండు కానుకిచ్చితే
జలధిపక్కపండు మంట శ్రీ వేంకటనాయకుడు
యెలమి కూడెనమ్మ చెంచు లేటికమ్మ తనకును…...తిరుమలయ్య…..

Tirumalagiriraya తిరుమలగిరిరాయ

తిరుమలగిరిరాయ
మోహన రాగం ,ఏక తాళం
అన్నమయ్య సంకీర్తన
Audio
తిరుమలగిరిరాయ…...
తిరుమలగిరిరాయ దేవరా హుత్తరాయ
సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ
తిరుమలగిరి రాయ….

సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ….
సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ
సరస వైభవరాయ సకల వినోదరాయ
వర వసంతములరాయ వనితల విటరాయ
గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ
……..తిరుమగిరి రాయ….


గొల్లెతల ఉద్ధండరాయ గోపాలక్రిష్ణ రాయ….
గొల్లెతల ఉద్ధండరాయ గోపాలక్రిష్ణ రాయ
చల్లు వెద జాణరాయ చల్ల పరిమళరాయ
చెల్లుబడిన ధర్మరాయ చెప్పరాని వలరాయ
కొల్లలైన భోగరాయ కొండల కోనేటి రాయ
…...తిరుమలగిరి రాయ…..


సామ సంగీతరాయ సర్వ మోహనరాయ….ఆ.ఆ.ఆ.ఆ.
స రి గా ….రి గ పా….గ ప ద….ప ద సా….
స రి గా  రి గ పా గ ప ద  ప ద సా
గరి గరి సద ..రిస రిస దప .. సద సద పగ..
గప గరిస
గరిగరిసద రిసరిసదప సదసదపగ గపగరిస
సామ సంగీతరాయ సర్వ మోహనరాయ
ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ
కామించి నిన్ను కోరితే కరుణించితివి నన్ను
శ్రీమంతుడా నీకు జయశ్రీ వేంకటరాయ

తిరుమలగిరి రాయ దేవరా హుత్తరాయ
సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ
తిరుమలగిరి రాయ…
తిరుమలగిరి రాయ….
తిరుమలగిరి రా...య………

Tirumala giriraya తిరుమలగిరిరాయ

తిరుమలగిరిరాయ
మోహన రాగం ,ఏక తాళం
అన్నమయ్య సంకీర్తన
Audio
తిరుమలగిరిరాయ…...
తిరుమలగిరిరాయ దేవరా హుత్తరాయ
సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ
తిరుమలగిరి రాయ….

సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ….
సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ
సరస వైభవరాయ సకల వినోదరాయ
వర వసంతములరాయ వనితల విటరాయ
గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ
……..తిరుమగిరి రాయ….


గొల్లెతల ఉద్ధండరాయ గోపాలక్రిష్ణ రాయ….
గొల్లెతల ఉద్ధండరాయ గోపాలక్రిష్ణ రాయ
చల్లు వెద జాణరాయ చల్ల పరిమళరాయ
చెల్లుబడిన ధర్మరాయ చెప్పరాని వలరాయ
కొల్లలైన భోగరాయ కొండల కోనేటి రాయ
…...తిరుమలగిరి రాయ…..


సామ సంగీతరాయ సర్వ మోహనరాయ….ఆ.ఆ.ఆ.ఆ.
స రి గా ….రి గ పా….గ ప ద….ప ద సా….
స రి గా  రి గ పా గ ప ద  ప ద సా
గరి గరి సద ..రిస రిస దప .. సద సద పగ..
గప గరిస
గరిగరిసద రిసరిసదప సదసదపగ గపగరిస
సామ సంగీతరాయ సర్వ మోహనరాయ
ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ
కామించి నిన్ను కోరితే కరుణించితివి నన్ను
శ్రీమంతుడా నీకు జయశ్రీ వేంకటరాయ

తిరుమలగిరి రాయ దేవరా హుత్తరాయ
సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ
తిరుమలగిరి రాయ…
తిరుమలగిరి రాయ….
తిరుమలగిరి రా...య………