15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

Kulukaka nadavaro కులుకక నడవరో

కులుకక నడవరో
అఠానారాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

Audio
కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు

ఒయ్యనే మేను కదలీ వొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీ పాద తాకు కాంతలాలా
పయ్యద చెరగు జారీ భారపు గుబ్బల మీఁద
అయ్యో చెమరించి మాయమ్మకు నెన్నుదురు

చల్లెడి గంధవొడి మై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు పణఁతులాలా
మొల్లయైన కుందనపు ముత్యాల కుచ్చులధర
గల్లనుచు కంకణాలు కదలీ మాయమ్మకు

జమళి ముత్యాలతోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల హారతు లెత్తరో
అమరించి కౌఁగిట అలమేలుమంగ నిదె
సమకూడె వేంకటేశ్వరుఁడు మాయమ్మకు.




On Jaya Jaya srinivasa ఓం జయ జయ శ్రీనివాస

ఓం జయ జయ శ్రీనివాస
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి : 
ఓం జయ జయ శ్రీనివాసా స్వామి జయ తిరుమలవాసా
భక్తుల కష్టము తీర్చుటకై ఇలవెలసిన దేవా
ఓం జయ జయ శ్రీనివాసా

చరణం :
ఏడుకొండల స్వామివి నీవు కరుణాధాముడవు
పిలచిన పలికే దేవుడవు
అలమేలుమంగ పతివి
ఓంజయ జయ శ్రీనివాసా..

ఆపద మొక్కుల స్వామివి నీవే ఆదుకొందువు దేవా
ఆర్తుల భాధలు తొలిగించి ఆనందమొసగు దేవా
ఓం జయ జయ శ్రీనివాసా…

శ్రీ ,భూ దేవుల గూడి స్వామి తిరు వీధులలోనూ
ఊరేగుచునూ దయాదృష్టితో భక్తుల బ్రోచెదవు
స్వామి భక్తుల బ్రోచెదవు….

వరహస్వామి క్షేత్రమందున నివసించే స్వామి
ప్రతి ఫలముగ ఆ స్వామికి నీవు ధనరాశుల నిత్తువట
ఓం జయ జయ శ్రీనివాసా‌….

మానవ మాత్రుల వలనే నీవు
లీలా నటనలతో
వడ్డికాసులు వసూలు చేసి రక్షణ చేతువయ్యా
భక్తుల రక్షణ చేతువయ్యా….

వేంకటనాధుడు అంటేనే మా పాపహారీ కాదా
భక్తుల పాపము తొలగించి ముక్తి నొసగుమయ్య
ఓం జయ జయ శ్రీనివాసా…

జయ మంగళమయ్యా స్వామి
శుభ మంగళమయ్య
శుభ పరంపరల నొసగి మమ్ము కాపాడదయ్యా
మము కాపాడగదయ్యా…..
ఓం జయ జయ శ్రీనివాసా…
ఓం జయ జయ శ్రీనివాసా…
ఓం జయ జయ శ్రీనివాసా…

13, సెప్టెంబర్ 2017, బుధవారం

Namo namo raghavaya anisam నమో నమో రాఘవాయ అనిశం

నమో నమో రాఘవాయ
తిస్ర లఘు తాళం , దేశికతోడి రాగం
Audio
పల్లవి :
నమో నమో రాఘవాయ అనిశం
నమో నమో రాఘవాయ అనిశం
నమో నమో రాఘవాయ అనిశం

చరణం :
శుకనుతాయ దీనబాంధవే
సకలలోక దయాసింధవే
నమో నమో రాఘవాయ అనిశం

నిజ సేవక కల్పక తరవే
అజరుద్రాద్యమర సుగురవే
నమో నమో రాఘవాయ అనిశం

దీన మానవ గళపతయే
దానవాంత కాయ సుమతయే
నమో నమో రాఘవాయ అనిశం

ఆయురారోగ్యదాయినే
వాయుభోజి భోగి సాయినే
నమో నమో రాఘవాయ అనిశం

వరగజకర తుళిత భాహవే
సరశిత దానవ సుభాహవే
నమో నమో రాఘవాయ అనిశం

నాగరాజ పాలనాయే
త్యాగరాజ సేవితాయే
నమో నమో రాఘవాయ అనిశం
నమో నమో రాఘవాయ అనిశం

Tenekante madhuramaiah తేనెకంటె మధురమయ్య

తేనెకంటే మధురమయ్య
రచన : వేమూరి సరోజని శాస్త్రిగారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
తేనెకంటే మధురమయ్య నీపేరు
తిరుమల తిరుపతి స్వామి జోహారు

చరణం :
నీకొండకు వచ్చేము నిలువు దోపులిచ్చేము
దండిగా కానుకలు హుండీలో వేసేము
ఆపద మొక్కుల స్వామి వెంకటేశ్వరా
అడుగడుగు దండాల తిరుమలేశ్వరా
…..తేనెకంటే మధురమయ్య….

కలియుగము లోన నీకు ఆలయైన వేల్పు లేదు
గోవిందాయని అంటే ఓయంటు పలుకుతావంట
ఏడుకొండల పైని బంగారుకొండ
మా తోడు నీడ నీవయ్య కూరిమి పంట
…...తేనెకంటే మధురమయ్య…..

Entamatrama , ఎంతమాత్రమున‌‌‌

ఎంతమాత్రమున
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు…..ఎంత….

కొలుతురు మిము  వైష్ణువులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలుతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుండనుచు....ఎంత...

సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే యల్పబుద్ది దలచిన వారికి అల్పంబవుదువు
గరిమల మిము నే  ఘనమని దలచిన  ఘనబుద్దులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది
తామెరువు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని
ఈ వలనే నీ శరణ ననెదను ఇదియే పరతత్వము నాకు.....4
….ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు…...

Podagantimaiah minnu పొడగంటిమయ్యా మిమ్ము

పొడగంటిమయ్యా మిమ్ము
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా

చరణం :
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పి దీర్చు కాలమేఘమా, మాకు
చేరువ చిత్తములోని శ్రీనివాసుడా

భావింప కైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా

చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా, ఓం నమో వేంకటేశాయా ఓం నమో వేంకటేశాయా
చెడనీక బ్రతికించే సిద్దమంత్రమారోగా
లడచి రక్షించే దువ్యౌషధమా
బడి బాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా.

Bhavamulona bahyamunandu భావములోన బాహ్యమునందు

భావములోన బాహ్యము
శుద్ధ ధన్యాసి రాగం,  ఆదితాళము
సంగీతం : వేదునూరి క్రిష్ణమూర్తి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

Audio
పల్లవి :
భావములోన బాహ్యము నందును
గోవిందా గోవిందా యని కొలువవో మనసా ll

చరణం :
హరియవతారములే అఖిల దేవతలు
హరిలోనివే బ్రహ్మాండంబులు
హరినామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి హరి యనవో మనసా ll
...భావములోన బాహ్యము నందును…

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా ll
...భావములోన బాహ్యము నందును…

అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీ వేంకటాద్రి మీద నిదె
అచ్యుత అచ్యుత శరణనవో మనసా ll
…...భావములోన బాహ్యము నందును
గోవిందా గోవిందా అని పలుకవో మనసా….

12, సెప్టెంబర్ 2017, మంగళవారం

Muddugare yasoda ముద్దుగారే యశోద

ముద్దుగారే యశోద
కురంజి రాగము  ,ఆదితాళము
గానం : శ్రీమతి విద్యాభారతి గారు
Audio
పల్లవి :
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకి సుతుడు ll

చరణం :
అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలోనున్న చిన్నికృష్ణుడు ll

రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచే కమలాక్షుడు ll

కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాల జలనిధిలోన పాయని దివ్యరత్నము
బాలుని వలె తిరిగి పద్మనాభుడు ll
Audio

Kondalalo nelakonna కొండలలో నెలకొన్న

కొండలలో నెలకొన్న
హిందోళ రాగం, ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు

కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాన్ జక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు

అచ్చపువేడుకతో అనంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నచ్చిన వాడు

కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించినవాడు
యెంచ యెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ పాలించినవాడు.



Govinda givindayani koluvare గోవింద గోవిందయని కొలువరే

గోవింద గోవిందయని కొలువరే
భౌళిరాగం,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే

చరణం :
హరిఅచ్యుతాయని ఆడరే
పురుషోత్తమాయని పొగడరే
పరమ పురుషాయని పలుకరే
సిరివర యనుచును చెలగరే జనులు
…..‌.గోవింద గోవిందయని కొలువరే…..‌

పాండవ వరదాయని పాడరే
అండజవాహను గొనియాడరే
కొండలరాయనినే కోరరే
దండితో మాధవుని తలచరే జనులు
….‌‌గోవింద గోవిందయని కొలువరే….‌‌
దేవుడు శ్రీ విభుడని తెలియరే
సోవల అనంతుని చూడరే
శ్రీవేంకటనాధుని చేరరే
పావనమై ఎపుడును బ్రదుకరే జనులు

గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే
గోవిందా గోవిందా గోవిందా..4

Vedambevvani వేదంబెవ్వని

వేదంబెవ్వని
రేవతి రాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
వేదంబెవ్వని
వేదంబెవ్వని వెదకెడెని
ఆ దేవుని కొనియాడుడీ..
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా

చరణం :
అలరిన చైతన్యాత్మకుడెవ్వడు
కలడెవ్వడెచట కలగలడనిన
తలతురెవ్వనిని తను వియోగ దశ
యికనాతని భజియించుడీ

వేదంబెవ్వని వెదకెడెని
ఆ దేవుని కొనియాడుడీ
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా

కడగి సకల రక్షకుడిందెవ్వడు
వడి నింతయు నెవ్వని మయము
పిడికిట తృప్తుల పితురులెవ్వనిని
తడవిడ ఘనుడాతని గనుడీ

వేదంబెవ్వని వెదకెడెని
ఆ దేవుని కొనియాడుడీ
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా

కదిసి సకల లోకంబుల వారలు
యిదివో కొలిచెదరెవ్వరిని
త్రిదశ వంద్యుడగు తిరువెంకటపతి
వెదకి వెదకి సేవించుడీ

వేదంబెవ్వని వెదకెడెని
ఆ దేవుని కొనియాడుడీ..
వేదంబెవ్వని వెదకెడెని
ఆ దేవుని కొనియాడుడీ
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా
వేంకట రమణ గోవిందా  వేంకట రమణ గోవిందా  వేంకట రమణ గోవిందా

Tapamemi toli chesitaiah తపమేమి తొలి చేసితయ్యా

తపమేమి తొలిచేసితయ్య
షణ్ముకరాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
పల్లవి :
తపమేమి తొలిచేసితయ్య
తిరువేంకటాధీశ నిను గూర్చినేపాడ

చరణం  :
జప సూత్రముల నేరనయ్యా
జన్నాల హోమాల విది నెరుగనయ్యా
అపచార యుక్తుండనైనా
కృపచూపి నన్నేలి నాచేత పాడించు
….. తపమేమి తొలిచేసితినయ్య…….

ఏ పూర్వ పుణ్యంబు ఫలమో
ఏనాడు ఏనోము నే నోచినానో
జననంబు ఫలియించగాను
నెనరుంచి నన్నేలి నాచేత పాడించు
…..తపమేమి తొలిచేసితయ్య….

అవ్యాజ కారుణ్యమవునో
దివ్యానురాగంబు ఔదార్యమౌనో
అత్యలప పుణ్యండుడైనా
అలమేలు మంగేశ పలుమారు పాడించు
….తపమేమి తొలిచేసితయ్య…...

Chudaramma satulala చూడరమ్మ సతులాల

చూడరమ్మ సతులాల
మధ్యమావతి రాగం , ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది కూడిన్నది పతిచూడి కుడుత నాంచారి
శోభానే...శోభానే….2

చరణం :
శ్రీమహాలక్ష్మీ అట సింగారాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు
సోముని తోబుట్టువట సొంపు కళలకే మరుదు
కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి

...చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది కూడిన్నది పతిచూడి కుడుత నాంచారి
శోభానే...శోభానే….2

కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు
తలప లోక మాతయట దయ మరి ఏ మరుదు
జలజ నివాసినియట చల్లదనమే మరుదు
కొలది మీర ఈ చూడి కుడుత నాంచారి

…..చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది కూడిన్నదిపతిచూడి కుడుత నాంచారి
శోభానే...శోభానే….2

అమర వందితయట అట్టె మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు
తమితో శ్రీ వేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెరె వయస్సు ఈ చూడి కుడుత నాంచారి

….చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది కూడిన్నది పతిచూడి కుడుత నాంచారి
శోభానే...శోభానే….2

11, సెప్టెంబర్ 2017, సోమవారం

Chandi chandasura damani చండీ చండాసుర దమని


చండీ చండాసుర దమని
సింధుభైరవి రాగం ,ఆదితాళం
గానం : ప్రణవి మొక్కరాల
Audio
పల్లవి :
చండి చండాసుర దమని
ఖండిత పాపా భవజనని
…..
చరణం :
అష్టమాతృకా రూపిణి
నవదుర్గా కృతి ధారిణి
దుర్ధమ భండని కారిణి
దుర్మద ఖండన ధోరిణి
…..చండి చండాసుర దమని
ఖండిత పాపా భవజనని
చండి చండాసుర దమని…..

సప్త శతీ మను సంస్తుత
లలితా ఖ్యానే ప్రస్తుతా
దేవీ సూక్తై రభీష్టతా
త్వం భవ దేవి మయి ముదిత
…...చండి చండాసుర దమని
ఖండిత పాపా భవజనని
చండి చండాసుర దమని…..

ఐం హ్రీం శ్రీం మను జపతుష్టా
సరిగమపదని స్వర పుష్టా
ఓంకారాద్భుత రవఘుష్టా
సచ్చిదానంద స్థితి శిష్టా
…..చండి చండాసుర దమని
ఖండిత పాపా భవజనని
చండి చండాసుర దమని
చండి చండాసుర దమని …..

Sri raja rajesi శ్రీరాజ రాజేశి

శ్రీరాజరాజేశి
షణ్ముక ప్రియ రాగం
రచన : గణపతి సచ్చిదానంద స్వామీజి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
శ్రీరాజరాజేశి కురుసత్కృప
శ్రీ చక్రవాసాసి హృదిమేవశ
విశాలభా విలాసినీ నవచక్రాంతర్వాసిని
సదైవ తత్ సత్ సుర స్వరూపే భక్తాళీ దేదీపే
‌‌‌…..శ్రీరాజరాజేశి కురుసత్కృప
శ్రీ చక్రవాసాసి హృదిమేవశ….

చరణం :
దేవీ చక్ర సమైక్యం మే చేతసి భావయామి
చక్ర బ్రహ్మాండైక్యంచ చిత్తే నిదధామి
అజాండ పిండాం డయోర భేదం భావేగాఢం చింతయే
మనూశ్చ దేవ్యా అభేదరీతిం ప్రాణ స్పందైర్ ధారయే
…..శ్రీరాజరాజేశి కురుసత్కృప
శ్రీ చక్రవాసాసి హృదిమేవశ….

నాదాకారతనూ శివ వామ శరీరగతే
వాగార్ధా కారే
బహు వేదాంతే ప్రవిచార్యే
శివే సదా విదాకృతే గజముఖ షణ్ముక ప్రియావహే
తదత్త రూపే త్వమర్ధ దీపే సచ్చిదానందే భయాపహే
…..శ్రీరాజరాజేశి కురుసత్కృప
శ్రీ చక్రవాసాసి హృదిమేవశ...హృదిమేవశ...హృదిమేవశ...

Omkari bijakshari ఓంకార బీజాక్షరి

ఓంకార బీజాక్షరీ
కానడరాగం , ఆదితాళం
గానం : మొక్కరాల కామేశ్వరీగారు
Audio
ఓంకార బీజాక్షరి రక్షాకరి
అభయ శుభంకరి కాళి మహేశ్వరి

రమ్య శుభాంగి శివ అర్ధాంగి
సంగీత ప్రేమోదినీ,  జగజ్జననీ ...ఓంకార. బీజాక్షరి…

రాజరాజేశ్వరి రామ సహోదరి
రాక్షస సంహారిణి విశ్వసాక్షిణి.. .ఓంకార బీజాక్షరి…

ఓంకార బీజాక్షరి రక్షాకరి
అభయ శుభంకరి కాళి మహేశ్వరి
అభయ శుభంకరి కాళి మహేశ్వరి
అభయ శుభంకరి కాళి … మహేశ్వరి

7, సెప్టెంబర్ 2017, గురువారం

Srunga giri pura vasini శృంగ గిరి పుర వాసిని

శృంగ గిరి పురవాసిని
రచన : వేమూరి సరోజనీ శాస్త్రిగారు
సామరాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
శృంగ గిరి పురవాసిని జననీ
మంగళకారిణి శ్రీ శారదే
శ్రీ భారతీ తీర్ధ అర్చిత చరణే
శుభదే వరదే శారదే

శృంగ గిరి పురవాసిని జననీ
మంగళకారిణి శ్రీ శారదే శ్రీ శారదే…..

చరణం :
బుద్ధి ప్రదాయిని జ్ఞానదాయిని మోక్షదాయిని శారదే
శ్రీ విద్యా స్వరూపిణి లలితే శ్రీచక్రార్చిత శారదే
బ్రహ్మాణి కమలాసను రాణి వీణా పాణి శారదే
ఆది శంకర హృదయ విహారిణి జగద్ధోధారిణి శారదే
….శృంగ గిరి పురవాసిని……

సప్త స్వరముల సంగీత సామ్రాజ్ఞి సులలిత పదే శ్రీ శారదే
సామవేద స్వరూపిణీ వాణి షణ్ముఖార్చిత శారదే
కోమల గాత్రి పరమ పవిత్రి గాయత్రీ శ్రీ శారదే
సరోజ దళ నేత్రి సావిత్రి భారతి విధాత్రి శారదే

శృంగ గిరి పురవాసిని జననీ
మంగళకారిణి శ్రీ శారదే
శ్రీ భారతీ తీర్ధ అర్చిత చరణే
శుభదే వరదే శారదే
శృంగ గిరి పురవాసిని జననీ
మంగళకారిణి శ్రీ శారదే శ్రీ శారదే…..

Raja rajeswari రాజ రాజేశ్వరి

రాజ రాజేశ్వరీ
అరభిరాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి
తేజ స్వరూపిణి దైత్య సంహారిణి
త్రిజగత్ భగవతి శరణు నిన్నే నమ్మితి

రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరీ…..

చరణం :
శుక్రవారపు పూజ శుభ దినములలోన
కొలువై యుండగ చూడగా
అడిగిన వారికి అభయము లిచ్చే తల్లి
అతులిత భాగ్యము లొసగు సర్వేశ్వరి

రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి…

అఖిలాండేశ్వరి నిత్య కళ్యాణి
కోటి సూర్య ప్రకాశిని
కంచికామాక్షి మధురమీనాక్షి కాశీవిశాలాక్షి కరుణించు ఈశ్వరీ

రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి…..